చైనా బిలియనీర్ బెగ్గింగ్.. ఎందుకో తెలుసా?

Update: 2022-04-10 07:11 GMT
చైనాలోని షాంఘై ప్రజలు లాక్ డౌన్ తో అల్లాడిపోతున్నారు. కరోనా కారణంగా చాలా రోజులుగా ఇంట్లోంచి బయటకు రావట్లేదు. కానీ తిండి దొరక్క వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. మిలియనీర్ అయినా బిలియనీర్ అయినా, ఎన్ని కోట్ల డబ్బులున్నా... అందరూ తినేది ఆహారమే. అయితే వేలాది కోట్లు ఉన్న వారు కూడా ఆహారం దొరకక.. ఇంట్లోంచి బయటకు రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అయితే చైనాలోని షౌంఘై నగరానికి చెందిన బిలియనీర్ క్యాథీ షెన్ తన తన పరిస్థితిని వివరిస్తూ... సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తమకు కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ... తినేందుకు బుక్కెడు బువ్వ దొరకట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారని వివరించింది. ఎవరైనా సాయం చేసి తమ ఆకలి తీర్చాలని కోరింది.

అంతే కాదు.. తినేందుకు బ్రెడ్డు ముక్కు ఇచ్చినా చాలని వేడుకుంటోంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కోటీశ్వరుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందోనంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ విధించిన ప్రభుత్వమే ప్రజలందరికీ ఆహారం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరనే.. కరోనా తగ్గిపోయింది అనుకునే సమంలోనూ తన రూపం మార్చుకుంటూ.. కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలను చంపేస్తోందంటున్నారు.

ఈ కోరనా మహమ్మారి పూర్తిగా ప్రపంచాన్ని వదిలి పోతేనే.. మనం ప్రశాంతంగా జీవించగలమని అంటున్నారు. అయితే  వైరాలజీ నిపుణులు మాత్రం కొవిడ్ ఇప్పట్లో పోదని అంటున్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి ఇతర వైరస్ జ్వరాల లాగే కరోనా కూడా ఉండిపోతుందని చెబుతున్నారు. కొవిడ్ మహమ్మారితో ఎల్ల కాలం సహజీవనం చేయాల్సిందేనని చాలా మంది వైరాలజీ నిపుణులు నొక్కి చెబుతున్నారు.

కరోనా సాధారణ జ్వరాల్లాగే ఉండిపోతే అందుకు సంబంధించిన జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతమైతే భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ.. ఇలా ఎప్పటికీ ఉండటం కష్టం. అందుకే కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని, తర్వాత సాధారణ జ్వరాల్లోగే చికిత్స తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పలు వేవ్ రూపంలో గడగడలాడించింది. ఒకటి, రెండు దశలు ప్రజలను బెంబేలెత్తించగా... మూడో వేవ్ అంతగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఒమిక్రాన్ వేరియంట్ మూడో వేవ్ రూపంలో దాడి చేసింది. అయితే.. దీని సంక్రమణ వేగంగా ఉన్నప్పటికీ లక్షణాలు అంతంతమాత్రమే ఉన్నాయి. చాలా మందికి కరోనా సోకినప్పటికీ.. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.
Tags:    

Similar News