అందమైన విశాఖ ఇపుడు ఆధ్యాత్మిక విశాఖగా మారిపోయింది. కొండలరాయుడు నేరుగా తరలి వచ్చి విశాఖ వాకిట నిలుచుకున్నాడు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయ్యాడు. ఏడు కొండలూ దిగి వచ్చి రుషికొండ మీద కొలువు తీరాడు. ఎదురుగా విశాఖ సాగర తీరం, అభిముఖంగా శ్రీనివాసుడు. ఆ సన్నివేశం భక్తులను ఉత్తేజం చేస్తుంది. ఆధ్యాత్మిక తరంగాలలో డోలలూగిస్తుంది.
విశాఖ బీచ్ రోడ్ లోని రుషికొండ వద్ద పది ఎకరాల స్థలంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి మహా సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచారు. శ్రీ మహాలక్ష్మి, గోదాదేవి సమేతుడైన శ్రీనివాసుడు ఇక్కడ కొలువు తీరాడు. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక గత అయిదు రోజులుగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నెల 24 నుంచి భక్తుల దర్శనార్ధం అనుమతిస్తున్నారు. ఎత్తైన కొండల మీద ఏర్పాటు అయిన ఈ ఆలయం భక్తులతో పాటు పర్యాటకులనూ కనువిందు చేస్తుంది. టీటీడీ ప్రత్యేక శ్రద్ధతో ఈ ఆలయాన్ని శరవేగంగా నిర్మాణం చేసింది.
ఇన్ని జరిగినా ఆలయ ప్రారంభోత్సవం మాత్రం కొంత జాప్యం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారభోత్సవం జరగాల్సి ఉన్నా ఆయనకు వీలు పడకపోవడంతో ఎట్టకేలకు ఆగమ పండితుల సూచనల మేరకు మహా సంప్రోక్షణ నిర్వహించి ఆలయ ద్వారాలు తెరిచారు.
మొత్తానికి విశాఖ వస్తే చూసేందుకు ఇప్పటిదాకా ఎన్నో సొగసులు ఉన్నాయి. వాటి కంటే మిన్నగా ఇపుడు టీటీడీ వారు నిర్మించిన స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. అంతే కాదు, విశాఖలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లేలా ఈ ఆలయం చిరకీర్తిని ఆర్జిస్తుంది అంటున్నారు. తిరుమల దేవదేవుడి దర్శనం కోసం ఎంతో దూరం వెళ్ళి వ్యయ ప్రయాసలకు ఓర్చే భక్తులకు ఇక మీదట ఆ శ్రమ లేకుండా స్వామి వారే విశాఖకు అరుదెంచారని అంటున్నారు. విశాఖ ఇక ఇల వైకుంఠంగా మారిందని ఆస్తిక జనులు మురిసిపోతున్నారు.