'జగన్ గ్యారేజీ' లో పనిచేస్తాం: కొడాలి నాని

Update: 2022-04-11 10:30 GMT
ఎన్టీ రామారావు తర్వాత రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్ బడుగు బలహీన, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయంగా.. ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తాజా మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తాము కేబినెట్ హోదా కోసమో.. గౌరవం కోసమో పనిచేయడం లేదని నాని స్పష్టం చేశారు.

జగన్ వెంట సైనికుల్లా పనిచేస్తామని.. రాష్ట్ర, పార్టీ భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి తమను అన్ని విధాల సముచిత గౌరవం ఇచ్చారని కొడాలి నాని అన్నారు.

జగన్ గ్యారేజీలో పార్టీ, రాష్ట్రం కోసం పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. తాము ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదని వివరించారు. మంత్రి పదవులు రాకపోవడంతో అనుచరుల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ త్వరలోనే సర్దుకుంటాయని మరో మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. తొలి క్యాబినేట్ లో తమకు చోటు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు.

ఇక మంత్రి పదవి దక్కకపోవడాన్ని అవమానంగా భావించడం లేదని కొడాలి నాని తెలిపారు. మేము అందరం జగన్ సొంత మనుషులం.. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం కోసం.. పార్టీ కోసం వీళ్లందరూ కట్టుబడి ఉంటారు. వీళ్లు నా మనుషులు.. వీళ్లను పదవి నుంచి తీసినా బాధపడరు అని జగన్ భావించారు.

దయచేసి పదవి రానివారు ఏడుపులు, శోకాలు పెట్టొద్దు.. జగన్ వెనుకాల సైనికుల్లా నిలబడుదాం.. మనకెవరికీ జగన్ అన్యాయం చేయరు అని కొడాలి నాని తెలిపారు.
Tags:    

Similar News