తమిళ ప్రేక్షకులకు దళపతిగా పేరుగాంచిన స్టార్ హీరో విజయ్. తలైవా అంటూ ముద్దుగా పిలుచుకునే ఇతడికి అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ అప్పుడప్పుడూ రాజకీయ అడుగులు వేసే విజయ్ ను రాజకీయాల్లోకి రావాలని ఆయన తల్లిదండ్రులు, ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుతున్నారు. విజయ్ తండ్రి అయితే ఏకంగా ఆయన పేరుతో పార్టీ పెట్టి రచ్చ చేశారు. ఇక ఫ్యాన్స్ సైతం విజయ పేరుతో ఆ అసోసియేషన్ పెట్టి దాని మీద స్థానిక ఎన్నికల్లో పోటీకూడా చేశారు.
సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై చర్చ తరచూ తెరమీదకు వస్తున్న వేళ విజయ్ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. తాను నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని.. ఈ పయనాన్ని కాలంతోపాటుగా అభిమానులే నిర్ణయించాలని స్పష్టం చేశారు.
విజయ్ సినిమా ‘బీస్ట్’ విడుదలకు రెడీ అయ్యింది. విజయ్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నెల్సన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈనెల 13న సినిమా తెరమీదకు వస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తన మనసులోని మాటను విజయ్ బయటపెట్టారు. రాజకీయంగా చర్చకు దారితీసేలా మాట్లాడారు. బీస్ట్ చిత్ర దర్శకుడు నెల్సన్ సంధించిన ప్రశ్నలకు విజయ్ ఇచ్చిన సమాధానాలు రాజకీయంగానే కాకుండా సినీ రంగంలోనూ చర్చకు దారితీశాయి.
తనకు దేవుడి మీద నమ్మకం ఉందని.. ఆలయాలు, దర్గాలు, దేవాలయాలకు వెళుతూనే ఉంటానని విజయ్ వివరించాడు. అలాగే తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తో ఉన్న విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. ‘చెట్టుకు వేర్లు ఎలాగో.. ఓ తండ్రి కుటుంబానికి అలాంటి వాడు అని.. దేవుడు కనిపించడు.. తండ్రి కనిపిస్తాడు’ అంటూ నర్మగర్భంగా సమాధానమిచ్చాడు.
తన కుమారుడు సంజయ్ సినీరంగ ప్రవేశంపై కూడా విజయ్ స్పందించారు. సంజయ్ సినిమాల్లో నటిస్తాడా? తెరవెనుక ఉంటాడా? అన్నది తెలియదని.. అతడి ఇష్టం బట్టి ఉంటుందని విజయ్ పేర్కొన్నాడు. అవకాశాలు మాత్రం వస్తున్నాయని తెలిపారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ సైకిల్ పై ఓటేసేందుకు యాధృశ్చికంగా వచ్చానని.. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. తన అభిమానులు స్థానిక సంస్థల గెలుపును నిశితంగా గమనిస్తున్నానని.. .. నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో ఉందని తెలిపారు. అభిమానులే దీన్ని నిర్ణయిస్తారని ముగించారు. విజయ్ రాజకీయాలపై తన ఇష్టాన్ని వెల్లడించడంతో అతడు రాజకీయాల్లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.