యూట‌ర్న్ రాజ‌కీయాలు.. ఏపీలో త‌ప్ప ఎక్క‌డా ఉండ‌వేమో.. ?

Update: 2022-07-31 03:30 GMT
ఏపీలో రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకున్నాయి. ఎక్క‌డికక్క‌డ నాయ‌కులు.. రాజ‌కీయాలు కూడా మారుతు న్నాయి. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. ఎలాంటి వాతావ‌ర‌ణం ఉందో.. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్‌.. అలాంటి వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. కాక‌పోతే.. ప్ర‌భుత్వాలు మారాయి. పార్టీలు మారాయి.

అధికారంలో అప్ప‌ట్లో.. టీడీపీ ఉంది. ప్ర‌తిప‌క్షంలో వైసీపీ ఉంది. కానీ.. సీన్ మాత్రం సేమ్  టు సేమ్‌గా ఉంది. దీంతో రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకున్నాయ‌ని అంటున్నారు.

ఒక్క‌సారి 2019 ఎన్నిక‌ల‌కు ముందుకు వెళ్తే.. ప్ర‌త్యేక హోదా అంశం.. లైవ్‌లో ఉంది. దీంతో ప్ర‌తిప‌క్షం దీనిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. హోదా సాధించాలంటే.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని.. ప్ర‌తిప‌క్షం .. అప్ప‌టి టీడీపీ స‌ర్కారుపై ఒత్తిడి తెచ్చింది. పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ప్ర‌జ‌ల్లోకి బాగా బ‌లంగా వెళ్లిపోయింది. దీంతో టీడీపీఅధినేత చంద్ర‌బాబు డోలాయ మానంలో ప‌డ్డారు.

వెంట‌నే కేంద్రంలోని మోడీ స‌ర్కారుతో విబేదించారు. మంత్రుల‌తో రాజీనామాలు కూడా చేయించారు. త‌ర్వాత‌.. మోడీపై కాలు దువ్వారు. ఢిల్లీలో ఎంపీల‌తో ఆందోళ‌న చేయించారు. త‌ర్వాత‌.. ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు అదే సీన్‌.. రివ‌ర్స్ అయింది. అధికార ప‌క్షంలో.. వైసీపీ ఉంది. ప్ర‌తిప‌క్షంలో టీడీపీ ఉంది. కానీ, స‌మ‌స్య‌లు మాత్రం అలానే ఉన్నాయి. పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదా, రాజ‌ధాని.. వెనుక‌బ‌డిన జిల్లాలు.. సేమ్ టు సేమ్‌.

ఇక‌, ఇప్పుడు కూడా.. అదే డిమాండ్ తెర‌మీదికివ‌చ్చింది. అధికార పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాల ని.. కేంద్రంపై పోరాడాల‌ని.. చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఏకంగా.. ముఖ్య‌మంత్రి కూడా రాజీనామా చేస్తే.. కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అయితే.. ఇది సాధ్య‌మే నా.. వైసీపీ గ‌తంలో టీడీపీ మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తుందా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఎట్టి ప‌రిస్తితిలోనూ.. అలా వ్య‌వ‌హ‌రించ‌దు. సో.. అప్ప‌టికి ఇప్ప‌టికి.. ఈ ఒక్క‌టే తేడా! మిగిలిన‌వ‌న్నీ.. సేమ్ టు సేమ్‌.. అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News