ఆ రెండూ ఉండాల్సిందే  అంటున్న జగన్.. బాబు...?

Update: 2022-11-28 02:30 GMT
వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ విపక్ష టీడీపీలలో టికెట్ దక్కాలీ అని ఎవరైనా అనుకుంటే వారికి రెండే అర్హతలు ఉండాలని అంటున్నారుట. నిజానికి వైసీపీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. జగన్ ఆలోచనలు బాబు ఆలోచనలు అసలు కలవవు. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం ఈ ఇద్దరూ ఒకే మాట అంటున్నారు. అదే అభ్యర్ధులకు టికెట్ ఇచ్చే విషయంలో వీరు పెడుతున్న కండిషన్లు, అడుగుతున్న అర్హతలు మాత్రం కచ్చితంగా ఒక్క లాగానే ఉన్నాయి అని ప్రచారం సాగుతోంది.

అదేంటి అంటే అంగబలం, అర్ధబలం. ఈ రెండూ ఉన్న వారికే టికెట్లు అని ఈ రెండు పార్టీలలో ప్రచారం సాగుతోంది. ఈసారి ఎన్నికలు నోట్లతో పాటు కోట్లతోనూ పనే అని ఆయా  పార్టీల నాయకులు మాట్లాడుకుంటున్నారుట కోట్లు ఎన్ని తీస్తే వారికే టికెట్ అనుకోవడానికి లేదు. జనంలో ఆదరణ ఉండాలి. అలాగే అంగబలం కూడా తోడు కావాలి. అలా కనుక ఉన్న వారు అయితేనే టికెట్ మీద ఆశపడవచ్చు అని అంటున్నారు.

వైసీపీ అధికార పార్టీ. దాంతో ఆ పార్టీకి వచ్చే ఎన్నికలు ఒక విధంగా సమస్య కాకపోవచ్చు. పవర్ లో ఉంటూ ఎదుర్కోవడం కాబట్టి అర్ధ బలం వరకూ ఒకే. కానీ సిట్టింగులకు టికెట్లు రాకపోతే మాత్రం కొత్తవారు అర్ధబలం కూడా సమకూర్చుకుని రంగంలోకి రావాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక టీడీపీ కూడా ఆ రెండూ ఉండాల్సిందే అని ఖరాఖండీగా చెబుతోంది అని అంటున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత బీకే పార్ధసారధి తాజాగా కురబ సామాజికవర్గానికి చెందిన సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది రూపాయలు ఉంటేనే తెలుగుదేశం పార్టీ టికెట్ దొరుకుతుంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఎవరూ టికెట్ కోసం ఆశలు పెట్టుకోవద్దని కూడా ఆయన చెప్పడం దుమారమే రేపుతోంది.

పార్టీలో పరిస్థితి అలా ఉందని ఆయన చెప్పారని కొందరు అంటూండగా ఆయన పార్టీ విషయాలను చెప్పి బదనాం చేశారని అదే పార్టీలో అంటున్నారు. ఆ విషయాలు ఎలా ఉన్నా బీకే పార్ధసారధి చెప్పిన మాటలనే ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. టీడీపీ మూడేళ్ళుగా విపక్షంలో ఉండి ఆరిపోయింది. అన్ని విధాలుగా ఇబ్బందుల్లో చాలా మంది నేతలు ఉన్నారు. మరి  వారు టికెట్ల కోసం కోట్లు ఎలా ఖర్చు చేయగలరు అన్న చర్చ అయితే సాగుతోంది. ఇంకో వైపు వైసీపీలో కూడా అర్ధ బలం అంగబలం అన్నదే చర్చగా ఉంది. ఇలా రెండు పార్టీలలో టికెట్ల కోసం ఆశిస్తున్న వారికి ఈ వార్తలు కలవరం రేపుతున్నాయి.

అయితే వచ్చే ఎన్నికలు కీలకమని, ప్రతిష్టాత్మకమని, అందుకే అధినాయకత్వాలు అన్ని విధాలుగా లెక్కలు చూసుకునే అభ్యర్ధులను దింపుతాయని అంటున్నారు. వైసీపీలో జగన్ ఎటూ మొహమాటాలకు తావు ఇవ్వరు. ఇపుడు బాబు కూడా అదే బాటలో నడవడంతో పాటు ఆ రెండు అర్హతల గురించి నేతలు ప్రచారం చేయడంతో ఎన్నికల్లో టికెట్ వెరీ కాస్ట్ లీ గురూ అని నిట్టూర్చే నేతలే ఎక్కువమంది కనిపిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News