ఆమె వైసీపీ పొలిటికల్ డిస్కవరీ అని చెప్పాలి. ఒక సాధారణ టీచర్ గా ఉంటున్న ఆమెను వైసీపీ చేరదీసి 2014 ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. ఆమె బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. అన్న జగన్ కి తాను అసలైన చెల్లెలుని అన్నట్లుగా వైసీపీలో ఆమె హల్ చల్ చేసేవారు. వైసీపీలో ఆమె ఫైర్ బ్రాండ్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. వైసీపీ విపక్షంలో ఉన్నపుడు అధికార తెలుగుదేశం మీద గట్టిగా పోరాడిన ఘనత ఆమెదే.
అలాంటి గిడ్డి ఈశ్వరి 2017లో సడెన్ గా సైకిలెక్కేశారు. దానికి కారణం ఆమెకు పాడేరు టికెట్ మీద వైసీపీ నుంచి సరైన హామీ లభించలేదు అని చెబుతారు. దాని కంటే ముందు ఆమె వైఖరి పట్ల వైసీపీకి అనుమానం ఉందని, అందుకే సైడ్ చేస్తూ వచ్చారని అంటారు. మొత్తానికి ఆమె సైకిలెక్కేసి నాడు మంచి పని చేశాను అనుకున్నా 2019 ఎన్నికల నాటికి అది మైనస్ అయింది. ఆమె ఫిరాయింపు వ్యవహారమే ఓడించింది అని అంటారు.
ఒక మాజీ ఎమ్మెల్యే కుమర్తెగా ఉన్న భాగ్యలక్ష్మిని తెచ్చి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబెడితే ఆమె ఏకంగా 42 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే గత మూడున్నరేళ్లుగా భాగ్యలక్ష్మి మీద సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. దానికి తోడు పాడేరులో ఎంపీపీ ఎన్నికల్లో అన్ని సీట్లూ ఆ పార్టీకి రాలేదు. అక్కడ టీడీపీ హవా చాటుకుంటూ వస్తోంది. బాక్సయిట్ గనులకు అక్రమంగా ఎమ్మెల్యే అనుమతిస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది. ఇంకో వైపు మావోయిస్టులు కూడా భాగ్యలక్ష్మి ని టార్గెట్ చేశారు. దాంతో ఆమె ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.
ఇక సీనియర్ లీడర్ గా గిడ్డి ఈశ్వరి మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతూ తన సత్తా చాటుతున్నారు. వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. దాంతో భాగ్యలక్ష్మి వ్యవహార శైలి కూడా ఆమెకు మైనస్ అవుతోంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను పెడితే కనుక వైసీపీకి ఇబ్బందే అని సర్వే నివేదికలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక గిడ్డి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పాడేరులో దూసుకుపోతున్నారు.
జనంతో నిత్యం కలసిపోవడంతో పాటు గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ఈసారి చాన్స్ తనకు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరో వైపు గిడ్డి మీద సానుభూతి పెరుగుతోంది. గిరిజనులు అంతా ఏకమొత్తంగా ఈసారి వైసీపీకి ఓటు వేసే పరిస్థితి అయితే కనిపించడంలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు సైతం గిడ్డి ఈశ్వరి పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఖాయమని ఆయన ప్రకటించేశారు. తాజాగా బాబు రివ్యూ చేసి గిడ్డిని గో ఎ హెడ్ అని ప్రోత్సహించారు. ఈసారి ఏజెన్సీలో టీడీపీ గెలుచుకుని రావడం ఖాయమని అంటున్నారు.
దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత టీడీపీ జెండా ఏజెన్సీలో ఎగురుతుందని కూడా తమ్ముళ్లు అంటున్నారు. గిడ్డి సైతం తన పోరాట పటిమతో వైసీపీని మట్టి కరిపిస్తాను అని సవాల్ చేస్తున్నారు. టీడీపీ ప్రయోగిస్తున్న బాణం గిడ్డితో వైసీపీ నడ్డి ఏజెన్సీలో విరిగిపోవడం ఖాయమనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.