ఏపీలో జనసేనతో టీడీపీ స్నేహం ఈ మధ్యనే మొదలైంది. విజయవాడలోని ఒక హొటల్ కి స్వయంగా చంద్రబాబు వెళ్లి మరీ పవన్ని కలసి వచ్చారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలసి పనిచేద్దామని కూడా ప్రతిపాదించారు. దానికి జనసేనాని పవన్ కూడా ఓకే చెప్పారు. ఆ తరువాత సేవ్ ఉత్తరాంధ్రా పేరిట భారీ కార్యక్రమానికి టీడీపీ రెడీ అయింది. నిజంగా ఇది వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమమే. మరి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి జనసేనను ఆహ్వానించలేదా అన్నదే చర్చకు వస్తోంది.
విశాఖలో శుక్రవారం రోజంగా ఎక్కడ చూసినా టీడీపీ నేతలే హల్ చల్ చేశారు. ఎటు చూసినా పసుపు జెండాలే రెపరెపలాడాయి. ఆ మీదట అరెస్టుల పర్వం సాగింది. హౌస్ అరెస్టులు కూడా చేశారు. అలా పోలీస్ వర్సెస్ టీడీపీగా సేవ్ ఉత్తరాంధ్రా తొలి రోజు కార్యక్రమం ముగిసింది. ఉత్తరాంధ్రాలోని ఆరు జిల్లాలలో వారం రోజుల పాటు స్థానిక సమస్యలను ఫోకస్ చేస్తూ వైసీపీ సర్కార్ ని టార్గెట్ చేస్తూ టీడీపీ ఈ భారీ ఆందోళనకు రంగం సిద్ధం చేసింది.
విశాఖలో ప్రముఖ టూరిజం స్పాట్ గా ఉన్న రుషికొండ భూముల కబ్జా మీద తొలి రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. కానీ రుషికొండకు చేరుకోకుండానే టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. తెలుగుదేశం బడా నాయకులను ఎవరినీ బయటకు రానీయలేదు. దాంతో అనకొండ చేతిలో రుషికొండ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ టీడీపీ నేతలు తమ పార్టీ ఆఫీసులోనే ఆందోళన జరుపుకోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు చేయడంతో పాటు, కొనుగోళ్ళు, అమ్మకాల మీద కూడా టీడీపీ నిరసనలను దిగుతోంది. అనకాపల్లిలోని చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయడం మీద కూడా నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని గొట్టాం బ్యారేజ్ నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో పాటు సాగు నీటి ప్రాజెక్టుల మీద వైసీపీకి శ్రద్ధ లేదని టీడీపీ ఎలుగెత్తి చాటబోతోంది. అలాగే దసపల్లా భూముల భాగోతాన్ని జనాల్లో చర్చకు పెడుతోంది. ఇలా అనేక కీలకమైన ఇష్యూస్ ని తీసుకుని సేవ్ ఉత్తరాంధ్రా గా భారీ ప్రొగ్రాం కి డిజైన్ చేశారు.
దీనికి స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, కిమిడి కళా వెకటరావు వంటి వారిని ఉంచారు. ఇలా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్న వేళ జనసేనతో కలసి ఎందుకు ఈ కార్యక్రమాలను చేయడం లేదు అన్నదే చర్చకు వస్తోంది. జనసేన కూడా రుషికొండ భూకబ్జాల మీద ఆందోళను చేస్తూ వస్తోంది. అలాగే దసపల్లా భూముల విషయం మీద జనసేన ఉద్యమిస్తోంది.
మరి ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు అనేక కార్యక్రమాలను జాయింట్ గా రెండు పార్టీలు చేయాల్సి ఉన్నా జనసేనను ఎందుకో సంప్రదించలేదా లేక ఆ పార్టీని సైడ్ చేసి మొత్తం పొలిటికల్ మైలేజ్ తమ ఒక్కరికే దక్కాలని చూసుకున్నారా అన్నదే ఇపుడు ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా జనసేనతో అదిలోనే స్నేహం పొడిచి అలా ఆగిందా అన్న దాని మీద కూడా హాట్ హాట్ డిస్కషన్స్ సాగుతున్నాయి.
అయితే దీని మీద మరో రకంగా ఆసక్తికరమైన సమాచారమే లభిస్తోంది. చంద్రబాబు జనసేనతో పొత్తు మీద రెండవ ఆలోచన చేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయట. ఎందుకంటే బీజేపీతో కలుపుకుని పోవాలని చంద్రబాబు చూస్తూంటే బీజేపీ నుంచి ఒక చిత్రమైన ప్రతిపాదన లాంటి డిమాండ్ ముందుకు వచ్చిందట. పవన్ కళ్యాన్ని కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తేనే తాము కూటమిలో చేరుతామని బీజేపీ షరతులతో కూడిన ప్రతిపాదన చేసింది అని అంటున్నారు.
దీంతోనే చంద్రబాబు అన్నీ ఆలోచించే ముందు సొంతంగా తమ మటుకు తాము కార్యక్రమాలు చేపడదామని భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది అంటున్నారు అధికారంలో వాటా అన్నది జనసేన నుంచి కూడా వస్తున్న డిమాండ్ గా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా చేయడం అంటే తమను తాము తగ్గించుకోవడమే కాకుండా ఫ్యూచర్ లో వైసీపీతో పాటు మరో బలమైన రాజకీయ ప్రత్యర్ధిని తాముగా తయారు చేసుకోవడమే అని టీడీపీ భావిస్తోందని అంటున్నారు. అందుకే ప్రస్తుతానికి టీడీపీ సోలోగానే ముందుకు పోవాలని డిసైడ్ అయింది అంటున్నారు. చూడాలి మరి ఎన్నికల వేళకు ఏమైనా పరిణామాలు మారుతాయో లేదో అన్నది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.