తెలంగాణాలో ముందే సినిమా చూపిస్తే...ఏపీలో ఎలా పవన్  ...?

Update: 2022-12-14 02:30 GMT
పవన్ కళ్యాణ్ కి 2024 ఎన్నికలు ఒక రకంగా అత్యంత కీలకం అయినవి. చాలా మంది అనుకునేది తెలుగుదేశం పార్టీకి చావో  రేవో అని. జగన్ కి కూడా అగ్ని పరీక్ష అని. కానీ మూడవ పార్టీగా ఉన్న జనసేనకు కూడా ఇవే కీలకం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి పార్టీ పెట్టి పదేళ్ళు అవుతుంది. మూడు ఎన్నికలను చూసినట్లు కూడా ఉంటుంది.

మరి ఈ సుదీర్ఘ సమయంలో రాజకీయ మెరుపులు మెరిపించకపోతే పవన్ కి ఇబ్బందే అంటున్నారు. ఆయన తాను పాతికేళ్ళ పాటు రాజకీయం చేయడానికి వచ్చాను అని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి పొలిటికల్ ఇమేజ్ అనే మంచు కరిగిపోతే అపుడు ఎంత కష్టించినా సుఖం ఉండదు. ఇక 2024లో పవన్ ముందు రెండు టార్గెట్లు ఉన్నాయి.

ఒకటి కింగ్ కావడం, రెండు కింగ్ మేకర్ కావడం. అది ఎలా అన్నది ఆయన వ్యూహాలను బట్టే ఉంటుంది. ఒంటరిగా పోటీ చేసి కింగ్ కోసం ఫైట్ చేయడమా లేక కింగ్ మేకర్ కావడమా అన్నది ఆయన ప్లాన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక పొత్తులతో కూడా రాజకీయం చేయాలనుకున్నా దానికి కూడా ఎంతో కొంత తగ్గినా పై చేయి సాధించేను అనిపించుకోవాల్సి ఉంటుంది. అలా జరగాలీ అంటే పవన్ పార్టీ గ్రాఫ్ ఎంత. అసలు బలం  ఎంత అన్నది చూడాలి.

అది అలా గుప్పిట మూసి ఉండగానే సీట్ల కోసం బేరం ఆడుకుంటేనే మజా ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ 2023లో తెలంగాణాలో పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన 32 చోట్ల తన పార్టీ అభ్యర్ధులను ఎంపిక చేయాలనుకుంటున్నారు. ఆయా చోట్ల బలమైన అభ్యర్ధులను పెట్టి పోటీకి తయారుగా ఉండాలని చూస్తున్నారు.

మరి తెలంగాణాలో పవన్ పార్టీ పవర్ ఎంత అన్నది ఈ ఎన్నికలతో తేలుతుంది. నిజానికి తెలంగాణా రాజకీఎయం మీద జనసేన  కొంత దృష్టి తగ్గించి చాలా కాలమే అయింది. అందువల్ల ఎకాఎకీన పోటీ అంటే ఫైట్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు. పైగా ఒంటరి పోరు అంటున్నారు. దాంతో తెలంగాణాలో అనుకున్న స్థాయిలో జనసేన పెర్ఫార్మెన్స్ లేకపోయినా లేక రాజకీయంగా చేదు ఫలితాలు వచ్చినా ఆ ప్రభావం ఏపీ మీద కచ్చితంగా ఉటుంది అని అంటున్నారు.

ఎందుకంటే తెలంగాణాలో ఎన్నికలు జరిగిన ఆరు నెలల తరువాతనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. దాంతో జనసేన అక్కడ బస్తీమే సవాల్ అంటూ దూకి అనుకున్న రిజల్ట్స్ సాధించలేకపోతే ఏపీలో కూడా కచ్చితంగా ఆ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. ఏపీ జనాలు కూడా అంత సీరియస్ గా జనసేనను చూస్తారా అన్న చర్చ ముందుకు వస్తుంది. ఇక పొత్తులకు వెళ్ళినా టీడీపీతో బేరమాడే శక్తిని కూడా కోల్పోయే సీన్ ఉంటుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

అసలు ఏపీ మీద ఫుల్ ఫొకస్ పెట్టి 2024 ఎన్నికల్లో జనసేన తేల్చుకుంటేనే బాగుంటుంది అన్న చర్చ కూడా ఉందిట. అనవసరంగా తెలనగాణాలో వేలూ కాలూ పెట్టి పొలిటికల్ ఇమేజ్ కి ఏపీలో టెస్ట్ పెట్టుకోవడం అవసరమా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయిట. చూడాలి మరి పోటీ జనసేన ఆలోచనలు ఎలా ఉన్నాయో అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News