బాబు తాజా స‌మీక్ష‌ల్లో తేల్చిందేంటంటే..!

Update: 2022-10-07 23:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా .. కొన్ని నెల‌ల‌పాటు.. స‌మీక్ష‌లు చేశారు. నాయ‌కు ల‌ను పిలిపించుకుని మ‌రీ మాట్లాడారు. మ‌రి ఏంతేల్చారు?  ఏం చేశారు? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇంత పెద్ద స‌మీక్ష‌లు చేసిన‌ప్పుడు.. చంద్ర‌బాబు ఏదో ఒక‌టి తేల్చేస్తార‌ని.. నాయ‌కులు భావించారు. కానీ, చంద్ర‌బాబు కేవ‌లం హెచ్చ‌రిక‌లకు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. దీంతోక్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఏమాత్రం మార‌క‌పోగా.. మ‌రింత చింద‌ర‌వంద‌ర‌గా మారింది.

నిజానికి చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల‌కు అభిమానం లేక‌పోలేదు. ఆయ‌న ప‌ట్ల విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ గౌర‌విస్తున్నారు. ఆయ‌న‌ను మ‌రోసారి సీఎంను చేసుకోవాల‌నే ఆకాంక్ష ఉన్న‌వారు కూడా పెరుగు తున్నారు. కానీ, ఎటొచ్చీ.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌పైనే ప్ర‌జ‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త లేకుండా పోతోంది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. ఇదే స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. అప్ప‌ట్లోనూ సిట్టింగు ఎమ్మెల్యేల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

అయితే.. ఈ విష‌యాన్ని ముందు లైట్ తీసుకున్న చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో గుర్తించారు. ప్ర‌జ‌ల‌కు వంగి వంగి ద‌ణ్నాలు పెట్టి.. నేను ఉన్నాను.. న‌న్ను న‌మ్మండి.. క్షేత్ర‌స్థాయిలో జ‌రిగిన త‌ప్పులు ఇక‌పై జ‌ర‌గ‌కుండా చూసుకుంటాను.. న‌న్ను చూసి.. ఓటేయండి.. అని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. మ‌రి అది స‌క్సెస్ అయిందా.. అంటే కాలేదు. మ‌రి ఇప్ప‌టికైనా.. తీసుకువ‌చ్చిన మార్పేంటి? అంటే.. జీరో! అంటున్నారు ప‌రిశీల‌కులు.

చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు పెడుతున్నారంటే.. వెంట‌నే సంచ‌ల‌న మార్పు దిశ‌గా ఆయ‌న ప్ర‌క‌ట‌న చేస్తార‌ని.. అంద‌రూ అనుకున్నారు. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే.. నేత‌ల‌ను మారుస్తార‌నే చ‌ర్చ కూడా జ‌రిగింది. కానీ, ఏం జ‌రిగిందో ఏమో.. చంద్ర‌బాబు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లూ చేయ‌కుండానే.. మ‌మ అనిపించి.. జాగ్ర‌త్త‌గా చేసుకోండి.. అంటూ..నేత‌ల‌ను పంపేశారు. అంటే.. మ‌ళ్లీ వారికే టికెట్లు ఇస్తాన‌నే సంకేతాలు పంపించేశారు. మ‌రి దీనివ‌ల్ల ఆయ‌న సాధించిందేంటి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News