అనకాపల్లి ఎమ్మెల్యే, పరిశ్రమలు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ శైలే వేరు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించడానికి వైఎస్సార్సీపీలో ఉన్న నేతల్లో అమర్‌నాథ్ ఒకరని చెబుతుంటారు. కాగా గతంలో అమర్‌నాథ్ తండ్రి గుర్నాథరావు కాంగ్రెస్‌లో, తల్లి తెలుగుదేశంలో, తాజాగా అమర్‌నాథ్ వైఎస్సార్సీపీలో ఉన్నారు. ఇలా కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు మూడు పార్టీల్లో ఉన్న అరుదైన రికార్డు అమర్‌నాథ్ కుటుంబానికి ఉంది.
కాగా విచిత్రమైన వ్యాఖ్యలు చేయడంలో అమర్‌నాథ్ శైలే వేరని చెబుతుంటారు. తనను చూసి ప్రతిపక్షాలు, సాధారణ జనాలు నవ్వుకుంటారనే స్పృహ కూడా అమర్‌నాథ్‌కు ఉండదని అంటుంటారు. ఇటీవల పవన్ కల్యాణ్‌ను ఉన్న ఫొటోను చూపించి పవన్ కల్యాణే తనతో ఫొటో దిగాడని చెప్పిన తిరకాసు క్యాండిటేట్.. ఈ అమర్‌నాథ్ అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌పై చేసే తీవ్ర విమర్శలకు గిఫ్టుగానే వైఎస్ జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అమర్‌నాథ్ మంత్రి పదవిని కొట్టేశారని అంటుంటారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు మంత్రి అమర్‌నాథ్ వేసేశారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. వేసేశారని అంటే ఎవరినో చంపారని కాదండీ బాబూ. రాష్ట్ర ప్రభుత్వం మద్యనిషేధం విధిస్తామని చెప్పలేదంట. అలాగే వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో కూడా మద్యనిషేధం అని పేర్కొనలేదట. కేవలం మద్యం ధరను ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే చేరుస్తామని చెప్పారట. ఎవరైనా మద్యం తాగాలని చూస్తే షాక్ కొట్టేలా చేస్తామని మాత్రమే చెప్పామని మంత్రిగారు తాజాగా వ్యాఖ్యలు చేశారు.
దీంతో నెటిజన్లకు అడ్డంగా దొరికారు. గతంలో పవన్ కల్యాణ్‌తో ఫొటో దిగి జనసైనికులు ప్రశ్నిస్తే తాను పవన్ కల్యాణ్‌తో ఫొటో దిగడమేంటని.. తాను సెలబ్రిటీ కావడంతో ఆయనే తనతో ఫొటో దిగాడని వ్యాఖ్యానించిన తిరకాసు కేండిడేట్ గుడివాడ అమర్‌నాథ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దీంతో ఆ ఘటనను పోల్చుకుని వేసేశాడు..మళ్లీ వేసేశాడు అని సినిమా డైలాగ్‌ను అమర్‌నాథ్‌కు వర్తింపజేసి ఆయనను నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. కనీస పరిజ్ఞానం కూడా లేని నీలాంటి వాళ్లందరినీ జగన్ మంత్రులుగా చేసినందుకు ఇలాంటి జోక్‌లు తాము వినాల్సిందేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.