వర్క్ షాప్ లో ఫుల్ క్లారిటీ...టికెట్ల లెక్క తెగిపోతోంది...?

Update: 2022-11-26 03:30 GMT
మరో పది రోజులలో వైసీపీలో అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వైసీపీ అధినాయకత్వం గత ఎనిమిది నెలలుగా ఎమ్మెల్యేలను జనంలోకి పంపిస్తూ పార్టీ ఎదుగుదల కోసం వారు ఏం చేస్తున్నారో చాలా క్లోజ్ గా పరిశీలిస్తోంది. ఇప్పటికి పదుల సంఖ్యలో సర్వే నివేదికలు మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి వచ్చాయి.

ఆ సర్వే నివేదికలను ఆధారం చేసుకుని మరీ జగన్ ఎప్పటికపుడు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ వచ్చారు. నాతో పాటే అంతా నడవాలని తాను కోరుకుంటాను అని జగన్ చెబుతూ వచ్చారు. కానీ సర్వే ఫలితాలలో చూసుకుంటే కొందరు మాత్రం ఆశించిన రిజల్ట్స్ ని సాధించడంతో వెనకబడిపోయారు. ఈ విషయంలో జగన్ ఏ మాత్రం మొహమాటపడదలచుకోలేదు అని అంటున్నారు.

దాంతో డిసెంబర్ 4న జరిగే వైసీపీ వర్క్ షాప్ లో ప్రకంపనలే రేగబోతున్నాయని అందరూ అంటున్నారు. దానికి ముందు పార్టీలో ప్రక్షాళన జరిగింది. ఇపుడు ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ స్టెప్స్ ఉంటాయని చెబుతున్నారు. ఈ సమావేశం కూడా గత వర్క్ షాప్ ల మాదిరిగానే సాఫీగా సాగుతుంది.

ఎమ్మెల్యేల పనితీరు మీద జగన్ వివరిస్తారని అంటున్నారు. అలాగే పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. అంతా అయ్యాక మాత్రం ఎవరికి టికెట్లు టిక్కు పెట్టబోతోంది జగన్ చెప్పేస్తారు అని అంటున్నారు. అంటే ఈ సమావేశాల్లొనే చాలా మంది జాతకాలు తేలిపోతాయని అంటున్నారు. ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకున్న వారికి మీ సంగతి మీరు చూసుకోండి అని చెప్పడమే ఉత్తమం అని జగన్ అనుకుంటే మాత్రం ఆ లిస్ట్ కచ్చితంగా  బయటకు వస్తుంది అని అంటున్నారు.

ఇలా చేయడం ఎందుకంటే వచ్చే ఎన్నికల కోసం కొత్త వారికి టికెట్లు ఇవ్వాలంటే వారిని జనం లో ఇప్పటి నుంచే ఉంచాలంటే ఈ లిస్ట్ బయటపెట్టడం కంటే మరో మార్గం లేదు అని అంటున్నారు. దాంతో ఈ సమావేశంలో మరోసారి పోటీకి టికెట్లు దక్కని వారి జాబితా వెల్లడి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ప్రచారం అయితే సాగుతోంది. ఇక గెలుపు తప్ప తనకు ఎవరూ సన్నిహితులు లేరని జగన్ తన చేతల ద్వారా స్పష్టం చేస్తున్న నేపధ్యంలో కచ్చితంగా ఈసారి చాలా మందికి రెడ్ సిగ్నల్ చూపించడం ఖాయమనే అంటున్నారు.

మరి వారిలో ఎవరి లక్కీ అవుతారో ఎవరు బ్యాడ్ లక్ ని వెంట తెచ్చుకుంటారో అన్నది తేలిపోతుంది అని అంటున్నారు. మరో విషయం ఏమిటి అంటే ఈ మీటింగ్ మీద వైసీపీ హై కమాండ్ సీరియస్ గా వర్క్ చేస్తోంది. అదే టైం లో ఈ వర్క్ షాప్ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న టెన్షన్ లో ఎమ్మెల్యేలు అంతా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి డిసెంబర్ 4వ తేదీ మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతుందా అంటే ఇప్పటికి జరుగుతున్న ప్రచారం చూస్తే అవుని అనే చెప్పక తప్పదేమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News