మోదీని చ‌ర్య‌తో చేటు..విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఎన్జీఓల సేవ‌లు మృగ్యం

Update: 2020-04-24 15:00 GMT
సాధార‌ణ రోజుల్లో స్వ‌చ్ఛంద సేవ‌ల పేరుతో కొన్ని ఎన్జీఓ సంస్థ‌లు కొన్ని సేవా కార్య‌క్ర‌మాలు చేసి వాటితో ప‌న్ను మిన‌హాయింపు పొందే సంస్థ‌లు ఇప్పుడు భారత‌దేశం విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో ఆ సంస్థలు క‌నిపించ‌డం లేదు. ప్రజారోగ్య వ్యవస్థకు ఎన్జీఓ సంస్థలను పునాదులుగా పేర్కొంటుండ‌గా ప్ర‌స్తుతం ఆ సంస్థ‌లు మాత్రం ఎక్క‌డా కాన‌రావ‌డం లేదు. గతంలో ఎలాంటి వ్యాధులు ప్ర‌బ‌లినా ముందుండే ఎన్జీఓ సంస్థలు ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర రూపం దాల్చిన స‌మ‌యంలో ఆ సంస్థ‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం లేదు.  ఎన్జీఓ సంస్థల సేవ‌లు ఇప్పుడు అత్యావ‌స‌రం. కాని దీన్ని గుర్తించ‌ని ఆ సంస్థ‌లు కార్యాల‌యాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. క‌రోనా వైర‌స్ నుంచి ఎదుర్కోవ‌డానికి ఎన్జీఓ సంస్థలు కృషి చేయాల‌ని నీతి ఆయోగ్ పిలుపునిచ్చినా పెద్ద‌గా స్పంద‌న రావ‌డం లేదు.

ఢిల్లీలోని ‘ఎంసీకేఎస్‌ ఫుడ్‌ ఫర్‌ ది అంగ్రీ ఫౌండేషన్‌’ - సాఫా ఆర్గనైజేషన్‌ -  హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ‘యూత్‌ ఫీడ్‌ ఇండియా ప్రోగ్రామ్‌’ - ‘శరణార్థి సేవ’  వంటి త‌దిత‌ర‌ సంస్థలు మాత్ర‌మే ప్ర‌స్తుతం క‌నిపిస్తోంది.

అయితే దీనికి కార‌ణం గ‌తంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న నిర్ణ‌యం ఆ సంస్థల‌ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. దేశంలోని ఎన్జీఓ సంస్థలకు అందుతున్న విదేశీ విరాళాలను నియంత్రించేందుకు 2017లో భార‌త ప్ర‌భుత్వం ‘ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌’ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చ‌ట్టం తీసుకురావ‌డంతో ఒక్కసారిగా దేశంలోని 20 వేలకు పైగా ఎన్జీఓ సంస్థల లైసెన్స్‌లు రద్దయ్యాయి.

దీంతో దేశ‌విదేశాల నుంచి స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు - విరాళాలు ఆగిపోయాయి. ప‌లు సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ఆ క్ర‌మంలో ఎన్జీఓ సంస్థలకు కొలరాడో కేంద్రంగా పని చేస్తున్న ‘క్రిస్టియన్‌ చారిటీ కంపాషన్‌ ఇంటర్నేషనల్‌’ అత్యధికంగా విరాళాలు అందించేది. ఆ చ‌ట్టం తీసుకురావ‌డంతో ప్ర‌స్తుతం ఆ సంస్థ అందించాల్సిన ఏటా 45 మిలియన్‌ డాలర్లు (దాదాపు 344 కోట్ల రూపాయలు) రావ‌డం లేదు. ఈ విధంగా ప‌లు సంస్థ‌లు ఉండేవి.. ఆ చ‌ట్టంతో చాలా సంస్థ‌లు ఉనికి కోల్పోయాయి.

ఇప్పుడు ఆ సంస్థ‌లు లేక విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌లు, రోగులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆ సంస్థ‌లు లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ సంస్థ‌లు ఉండి ఉంటే కొద్దోగొప్పో ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు ఉండేవి. కేంద్రం తీసుకొచ్చిన ఆ చ‌ట్టంతో ప్ర‌స్తుతం ఆ సంస్థ‌ల సేవ‌లు మృగ్య‌మ‌య్యాయి. ఆ సంస్థ‌లు ఉండి ఉంటే ఇప్పుడో ఎంతో స‌హ‌క‌రించేవి.

Tags:    

Similar News