జగన్ పథకాలకు ‘కోడ్’తో నిమ్మగడ్డ అడ్డు.. ఏం జరుగనుంది?

Update: 2021-01-09 14:00 GMT
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసి ఏపీ సర్కార్ తో ఫైట్ కు రెడీ అయ్యారు. ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సర్క్యూలర్ జారీ చేయడం సంచలనమైంది.

సీఎం జగన్ ఇప్పటికే ‘అమ్మఒడి’ పథకం ప్రవేశపెట్టారు. లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న ఈ పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఇక కోడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీపైనా ఆంక్షలు విధించారు.

అయితే ఇప్పటికే అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి నెల్లూరులో సన్నాహాలు చురుకుగా సాగుతున్నారు.. మరి ఎన్నికల సంఘం ఆదేశాలతో జగన్ ఆగుతారా? లేక ముందుకు సాగుతారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

సంక్షేమ పథకాలపై గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నా.. బడ్జెట్ కేటాయింపులు చేసినా పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేస్తోందంటూ ఎస్ఈసీ వాటిని ప్రజలకు అందించడం ఆపాలని తాజాగా వివాదాస్పద సర్క్యూలర్ జారీ చేశారు.

అయితే ఈ ఆదేశాల్లో రాజకీయ అజెండా ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎస్ఈసీ ఏకపక్షంగా ప్రభుత్వం అనుమతి లేకుండా ముందుకు వెళ్లడంపై గుర్రుగా ఉంది.
Tags:    

Similar News