మంత్రి కొడాలి వ్యాఖ్యలపై గవర్నర్‌ కు నిమ్మగడ్డ ఫిర్యాదు !

Update: 2020-11-19 15:10 GMT
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం , ఎస్ ఈ సీ మధ్య వివాదం రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ ఏ సీ ప్లాన్ చేస్తుంటే , కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం కుదరదని అంటుంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించినా, రెండుసార్లు వాయిదా పడింది. ఈ తరుణంలో ఎస్ ఈ సీ గవర్నర్‌ హరిచందన్ ‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ప్రభుత్వ నుంచి సహకారం రావడం లేదని ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అలాగే ఇదే సమయంలో మంత్రి కొడాలి వ్యాఖ్యలపై గవర్నర్ హరిచందన్‌ కు ఫిర్యాదు చేశారు ఎస్‌ ఈసీ నిమ్మగడ్డ.

కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వీడియోలను గవర్నర్‌ కు పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతుంటే ఉద్దేశపూర్వకంగానే తనపై విమర్శలు చేస్తున్నారని గవర్నర్ ‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారట. ఇవి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలని ఫిర్యాదులో ప్రస్తావించారట. నాని వ్యాఖ్యలకు సంబంధించి. కొడాలి నానిపై తక్షణమే నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు నిమ్మగడ్డ.
Tags:    

Similar News