నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. మరో మలుపు

Update: 2020-12-18 12:21 GMT
ఆంధ్రప్రదేశ్‌ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య కొనసాగుతున్న గొడవ శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నాడు. అయితే  జగన్  ప్రభుత్వం  రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు సహకరించలేదని, గతంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్వహించడం ఎస్‌ఇసి నిమ్మగడ్డ మండిపడుతున్నారు.  తన చేతుల్లోనే అధికారం ఉన్న జగన్ సర్కార్ వల్ల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై కోర్టు ధిక్కార పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసి సంచలనం సృష్టించారు నిమ్మగడ్డ.

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ కె ద్వివేదిలకు నిమ్మగడ్డ పలు లేఖలు రాసినప్పటికీ, ఇప్పటి వరకు వారి నుండి సరైన స్పందన రాలేదని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఇసికి నిధులు విడుదల చేయడం లేదని, కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. ఓటరు జాబితాల తయారీలో ఎస్‌ఇసికి సహాయం చేయడం లేదని నిమ్మగడ్డ ఆరోపించారు.

హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాటించడం లేదని - తన లేఖలను పట్టించుకోలేదని నిమ్మగడ్డ ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్‌ఇసికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News