మహమ్మారి దెబ్బకు నిమ్స్ హాస్పిటల్ మూసివేత

Update: 2020-06-07 10:58 GMT
ప్రభుత్వాలు లాక్డౌన్  పరిమితులను సడలించడంతో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 206 పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తెలంగాణలో సడలింపులతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. జిహెచ్‌ ఎంసి పరిధిలోనే ఏకంగా 152 కేసులు నమోదయ్యాయి, 28 కేసులు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నమోదయ్యాయి.

ప్రఖ్యాత నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) 2020 జూన్ 7 నుండి మూడు రోజులు పాక్షికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఎందుకంటే ఈ ఆస్పత్రిలో పనిచేసే వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఆసుపత్రిలో ఐదు విభాగాలు మూతపడ్డాయి. శానిటైజేషన్ పనులు పూర్తయిన తర్వాత జూన్ 10 న  మూడు రోజుల తరువాత ఈ ఆస్పత్రిని తెరవనున్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 3,946 మందికి పైగా పాజిటివ్ గా తేలారు. మరణాల సంఖ్య 123, ఇందులో యాక్టివ్ కేసులు 1,663గా ఉన్నాయి.

యాదద్రి-భువనగిరి జిల్లా ఇప్పటివరకు సున్నా  కేసులతో గ్రీన్ జోన్ గా ఉంది. అయితే గత 24 గంటల్లో మొదటి పాజిటివ్ కేసు ఇక్కడ నమోదైంది. సివిల్స్ పరీక్ష కోసం శిక్షణ పొందుతున్న ఒక విద్యార్థి న్యూ ఢిల్లీ నుండి తిరిగి వచ్చాడు. అతడికి  పాజిటివ్ గా తేలింది.  అతను, అతడి తొమ్మిది ప్రాధమిక కాంటాక్టులతోపాటు, కుటుంబ సభ్యులను చికిత్స కోసం బిబినగర్ లోని ఎయిమ్స్ కు తరలించారు.


Tags:    

Similar News