తెలిసీతెలియని వయసులో చేసిన నేరానికి ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి. తెల్లారితే ఉరిశిక్ష విధిస్తారు.. దాన్ని ఎలా తప్పించుకోవాలని నిర్భయ నిందితుల్లో ఒకరైన పవన్ గుప్తా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉన్న అవకాశాలను వాడుకుని ఉరి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. అయితే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మరోసారి క్షమాభిక్ష కోరుతూ వినతి పెట్టుకున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచార ఘటన జరగ్గా. సంవత్సరాలుగా ఆ కేసులో విచారణ కొనసాగుతోంది. చివరకు మార్చి3వ తేదీన నిర్భయ ఘటనలో నిందితులుగా ఉన్న ముఖేశ్, వినయ్, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలకు ఉరి శిక్ష విధించాలని ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17వ తేదీన తీర్పు ఇచ్చింది. అయితే ఆ శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మిగతా ముగ్గురు వివిధ కోర్టులు, రాష్ట్రపతి వద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తనకు ఉన్న అవకాశాలను పవన్ గుప్తా వినియోగించుకుని తప్పించుకోవాలని చూస్తున్నాడు. అందులో భాగంగా ఘటన జరిగిన రోజు తాను మైనర్ అని, 16 ఏళ్లు రెండు నెలలని అది తన స్కూలు రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుందంటూ పిటీషన్ వేశాడు. ఉరిశిక్ష తప్పించి జీవితకాలం జైలుశిక్ష విధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
దీంతో వెంటనే తేరుకుని రాష్ట్రపతి వద్దకు వెళ్లాడు. రాష్ట్రపతిని క్షమాభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేశాడు. ఇక అతడి ఉరిశిక్ష అమలు అంశం రాష్ట్రపతి చెంతకు చేరింది. అయితే రాష్ట్రపతి ఏం నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. రాష్ట్రపతి తిరస్కరిస్తే మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు నిందితులందరికీ ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. రాష్ట్రపతి నిర్ణయం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది.