మరోసారి నిర్భయ దోషులకు ఉరి వాయిదా ఖాయమా అంటే ...అవుననే చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే మరో నాలుగు రోజుల్లో నిర్భయ దోషులను ఉరితీయాల్సి ఉన్న నేపథ్యంలో , ఉరిశిక్ష అమలుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ సమయంలో మరోసారి ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ ఉరి శిక్ష నుండి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలను చేసారు, ఇప్పటికి కొనసాగిస్తున్నారు. తాజా నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేశాడు.
తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోర్టును అభ్యర్థించాడు. నిర్భయ కేసు దోషులను మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరితీయనున్నారు. నలుగురు దోషులు ముకేశ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌ను ఒకేసారి శిక్ష అమలుచేయనున్నారు. ఐతే నలుగురు దోషులు పక్కా ప్రణాళికతో ఉరిశిక్షను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మన చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేయించుకున్నారు. నలుగురు దోషుల్లో ఇప్పటికే ముగ్గురు దోషులు తమకున్న న్యాయపరమైన అవాశాకాలన్నింటినీ ఉపయోగించుకోవడం తో,ఇక ఈసారి పవన్ గుప్తా వంతు వచ్చింది. పవన్ గుప్తా ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలను వినియోగించుకోలేదు. ఐతే మరో నాలుగు రోజుల్లో ఉరిశిక్ష అమలు చేయబోతున్న నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేయడంతో మరోసారి ఉరి వాయిదా పడేలా కనిపిస్తుంది.