మ‌ధ్యంతర ఎన్నిక‌ల‌కు నితీశ్

Update: 2015-11-29 07:20 GMT
అవును మీరు చ‌దివింది నిజ‌మే. మహాకూట‌మి పేరుతో కూట‌మి ఏర్పాటుచేసిన జేడీయూ నేత నితీష్‌ కుమార్ దుమ్మురేపే ఫ‌లితాల‌తో బీహార్ ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్యమంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే నితీశ్‌ సారథ్యంలోని మహాకూటమి ప్రభుత్వం మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంది. ఈ మాట చెప్పింది ఎవ‌రో తెలుసా? కేంద్ర మంత్రి, లోక్‌ జ‌న‌శ‌క్తి పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్!

బీహార్  ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై ఎల్‌జేపీ నేతలతో పాశ్వాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జేడీయూ -ఆర్‌ జేడీ - కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి ఎన్నికల్లో కులం కార్డు ప్రయోగించిందన్నారు. అయితే ఇది దీర్ఘకాలంలో పనిచేయదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో లూలూ ప్రసాద్ యాదవ్‌ కు చెందిన ఆర్‌ జెడి అతిపెద్ద పార్టీగా నిలువగా, జేడీయు రెండో స్థానంలో ఉందని, దీంతో ఆ రెండు పార్టీలు ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటాయన్నారు. ఒకటిన్నర రెండేళ్లు కంటే ఎక్కువకాలం మనలేదని, మధ్యంతర ఎన్నికలు తథ్యమని పాశ్వాన్‌ జోస్యం చెప్పారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు పోటీ చేసిన పాశ్వాన్ పార్టీ ఎల్‌ జేపీ కేవలం రెండే సీట్లు గెలుచుకుంది. పాశ్వాన్  చిన్నతమ్ముడు, ఎల్‌ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు పసుపతి కుమార్ పరస్ - ఆయన ఇద్దరి అల్లుళ్ల్లు - మేనల్లుడు - పలువురు బంధువులు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయితే పాశ్వాన్ ఆశ మ‌రీ వాస్త‌వ‌దూరం అవుతుందేమో.
Tags:    

Similar News