నిజామాబాద్ జిల్లా తోపు..మా అయ్య తమ్ముడు..!

Update: 2021-03-17 16:30 GMT
సీనియ‌ర్ నాయ‌కుడు.. ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ త‌న‌యుడు - ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌.. టీఆర్ ఎస్ నేత‌ - రాజ్య‌స‌భ స‌భ్యుడు - మాజీ స్పీక‌ర్ కేఆర్ సురేష్ రెడ్డి‌పై ఒక రేంజ్‌ లో విరుచుకుప‌డ్డారు. ప్ర‌స్తుతం.. అర్వింద్‌ కు ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను నిజామాబాద్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన `ప‌సుపు బోర్డు` ఏర్పాటు హామీ సెగ పెడుతోంది. ఇంటా బ‌య‌టా కూడా దీనిపై ఆయ‌న‌కు నిద్ర లేకుండా పోతోంది. కేంద్రంలోని బీజేపీ పాల‌కులు.. స్పైస‌స్ బోర్డు ఇచ్చాం అంటారు.. కానీ, నిజామాబాద్ ప్ర‌జ‌ల‌కు అర్వింద్ ప‌సుపు బోర్డు హామీ ఇచ్చారు. ఇదే ఆయ‌న‌ను గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కేలా చేసింది. కానీ, ఈ హామీని నెర‌వేర్చ‌లేక పోవ‌డంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇటు టీఆర్ ఎస్‌ - అటు కాంగ్రెస్ నుంచి కూడా ప‌దునైన విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో అంతే రేంజ్‌ లో ధ‌ర్మ‌పురి అర్వింద్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్ర‌ధానంగా.. టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు - మాజీ స్పీక‌ర్ కేఆర్ సురేష్ రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోశారు. `` నిజామాబాద్ జిల్లా పెద్దమనిషి`` అంటూనే సురేష్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరారు. పసుపు బోర్డు వ్యవహారం పై సురేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటరిస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ``మన నిజామాబాద్ జిల్లా పెద్దమనిషి సురేష్ రెడ్డి.. రాజకీయంగా బతికే ఉన్నానని ఈ రోజు అందరికీ యాది చేశారు`` అని ప్రారంభించి.. తీవ్ర‌స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

``సురేష్ రెడ్డి తీరు దొంగలు పడిన ఆర్నెల్ల‌కు కుక్కలు మొరిగినట్టుంది. మీ చరిత్ర హీనమైన కాంగ్రెస్ పార్టీ 1987లో ఎటువంటి సంబంధం లేని కేరళలో స్పైసెస్ బోర్డు పెట్టింది.. అవసరం లేకున్నా విదేశాల నుంచి పసుపును దిగుమతి చేసుకుంది. బీజేపీ ప్రభుత్వం స్పైసెస్ బోర్డును నిజామాబాద్‌ కు తెచ్చింది. దిగుమతులు ఆపడంతోపాటు ఇక్కడి నుంచే పసుపును ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. పసుపు రైతులకు మండల స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పలు స్కీమ్‌ లు అమలు చేసింది. అందుకే ఈ రోజు పసుపు ధర పెరిగింది. సురేష్ రెడ్డి అనే తోపు ఒకప్పుడు అందరితో బాపు అనిపించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర బానిస అయ్యారు.`` అని తీవ్ర‌స్థాయిలో విజృంభించారు అర్వింద్‌.

ఇక‌, కాంగ్రెస్ నేత‌ - మాజీ ఎంపీ మ‌ధు యాష్కీని సైతం విడిచిపెట్ట‌లేదు.``ఇంకొకాయన.. మా అయ్య తమ్ముడు మధు యాష్కీ ట్వీట్ చేసిండట. ఇక ఆయనకు కూడా నేను రియాక్ట్ అయితే నిజామాబాద్ ప్రజలు నాకు పని లేదనుకుంటారు`` అని .. కాబట్టి ఆయన్ను లైట్ తీసుకుంటున్నాని సెటైర్లు వేశారు. ప్ర‌స్తుతం అర్వింద్ వీడియో భారీ ఎత్తున వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News