క‌రోనా కండీష‌న్ః రూ.10 ల‌క్ష‌లు ఇస్తామ‌న్నా.. నో ఎంట్రీ!

Update: 2021-04-17 00:30 GMT
దేశంలో క‌రోనా విజృంభ‌ణ ఏ స్థాయిలో కొన‌సాగుతోందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజుకు 2 ల‌క్ష‌ల కేసులు న‌మోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో.. రోగులు ఆసుప‌త్రుల‌కు పోటెత్తుతున్నారు. ఫ‌లితంగా.. బెడ్లు దొరికే ప‌రిస్థితి లేకుండా పోయింది. డ‌బ్బులు ఎంత ఇస్తామ‌ని చెప్పినా.. నో వేకెన్సీ అని చెప్పి బ‌య‌ట‌కు పంపించేస్తున్నాయ‌ట‌.

హైద‌రాబాద్ లోని  ప్ర‌ధాన కార్పొరేట్ ఆసుప‌త్రుల‌న్నీ రోగుల‌తో నిండిపోయాయని తెలుస్తోంది. ఆసుప‌త్రుల్లో ఎన్ని వంద‌ల బెడ్లు వేసినా.. వెంట‌నే ఫుల్ అయిపోతున్నాయ‌ట‌. అడ్వాన్సుగా 10 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లిస్తామ‌ని చెబుతున్నా.. నో బెడ్ అని చెప్తున్నారంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

బెడ్ దొరికిన వారి నుంచి మాత్రం దారుణంగా డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రోజుకు రూ. 30 నుంచి 40 వేల వ‌ర‌కు ఛార్జ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఐదు రోజులు ఉంటే సుమారు 2 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే.. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ప‌రిస్థితి ఇలా ఉంటే.. రాజ‌ధానిలోని ప్ర‌భుత్వ ద‌వాఖానాలు మొత్తం ఖాళీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. టిమ్స్‌, ఛెస్ట్ ఆసుప‌త్రి, కింగ్ కోటి ద‌వాఖానాల్లో వంద‌లాది ప‌డ‌క‌లు ఖాళీగా ఉన్నాయ‌ట‌. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స‌రైన వైద్యం అందే ప‌రిస్థితి లేదంటూ.. రోగులు ప్రైవేటు బాట ప‌డుతున్న‌ట్టు స‌మాచారం.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం మిన‌హా మ‌రో మార్గం  క‌నిపించట్లేదు. మాస్కు విధిగా ధ‌రించడం.. భౌతిక దూరం పాటించ‌డం.. శానిటైజ్ చేసుకోవ‌డం అల‌వాటుగా మార్చుకోవాల్సిన పరిస్థితి. ఇంత జ‌రుగుతున్నా కొంద‌రు నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News