ప్రఖ్యాత అంతర్జాతీయ ఐకియా స్టోర్ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల క్రితమే హైటెక్‌సిటీ ప్రాంతంలో ప్రారంభమైన ఈ కీలక స్టోర్‌కు చెందిన ఫుడ్ కోర్టులో శాఖాహార బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితుడు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ఫిర్యాదుకు స్పందించి జీహెచ్ ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి నిర్వాహకులకు రూ. 11,500 జరిమా నా విధించారు. ఈ నేపథ్యంలో ఐకియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ హైదరాబాద్ షోరూమ్ లో బిర్యానీ - సమోసాల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కస్టరమర్ల ఆరోగ్యానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, అంతర్గత దర్యాప్తుకు ఆదేశించామని తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.... నగరానికి చెందిన అబీద్ అహ్మద్ అనే వ్యక్తి శనివారం ఐకియా ఫుడ్ కోర్టులో శాఖాహార బిర్యానీ తింటుండగా అందులో గొంగళిపురుగును గుర్తించాడు. వెంటనే దాన్ని ట్విట్టర్ ద్వారా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తోపాటు మీడియాకు తెలిపాడు. దీంతో వెంటనే జీహెచ్ ఎంసీ అధికారులు సదరు ఫుడ్ కోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా అక్కడ 50మైక్రాన్ల కన్నా తక్కువ మందంగల నిషేధిత ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే వారు ఫుడ్ కోర్టు మేనేజర్ కు నోటీసులు జారీచేయడంతోపాటు రూ.11500 జరిమానా విధించారు. అలాగే, ఐకియాకు బిర్యానీ సరఫరా చేస్తున్న నాగపూర్ కు చెందిన హల్దీరామ్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేశారు.
ఈ పరిణామం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఐకియా స్పందించింది. అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనకు తాము చింతిస్తున్నట్లు ఐకియా ప్రకటించింది. దీనిపై అధ్యయనం నిర్వహించి లోపాలను సరిచేసుకుంటామని ఐకియా ప్రతినిధులు ప్రకటించారు. రెండు రోజుల అనంతరం తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. `సురక్షిత - నాణ్యమైన ఆహార సరఫరాకు ఐకియా అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వినియోగదారుల ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహిస్తుంది. ఆగస్టు 31న జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. బిర్యానీలో పురుగు వచ్చిందనే ఫిర్యాదుపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించాం. ఇదే సమయంలో ఐకియా - హైదరాబాద్ లో బిర్యానీ - సమోసాలను ఆపేస్తున్నట్లు తెలియజేస్తున్నాం’ అని ఐకియా పేర్కొంది.