మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లేదు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే డివిలియర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. కానీ డివిలియర్స్ రీ ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. అందుకు కారణం ఐపీఎల్ లో అతడి విధ్వంసక ప్రదర్శన. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే డివిలియర్స్.. ఎన్నో మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లను గెలిపించాడు. దీంతో అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. మరోవైపు డివిలియర్స్ టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఆడబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఏబీడీ కూడా కొన్ని సంకేతాలు ఇచ్చాడు.
అయితే తాజాగా దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్ టూర్ కు జట్టును ప్రకటించింది. అందులో డివిలియర్స్ పేరు లేదు. దీంతో అసలు డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? లేదా? అన్న విషయంపై సందిగ్ధం నెలకొన్నది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చేసింది. డివిలియర్స్ ఇక మీదట అంతర్జాతీయ క్రికెట్ లో ఆడబోవడం లేదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల సౌత్ఆఫ్రికా క్రికెట్ బోర్డు .. డివిలియర్స్‌తో చర్చలు జరపగా.. అతడు రిటైర్మెంట్కు కట్టుబడి ఉన్నట్టు వాళ్లకు చెప్పాడట.
2018 మే నెలలో డివిలియర్స్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. అప్పటికీ అతడు మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. అయినప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి అతడి రీ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని అతను ఆశించినా... చివరి నిమిషంలో ఈ విషయం చెప్పడంతో బోర్డు ఏబీ విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే అప్పటి వరల్డ్‌కప్‌లో సౌత్ఆఫ్రికా పేలవ ప్రదర్శన ఇచ్చింది. అనంతరం డివిలియర్స్ రీ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు తెరపడింది.