ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో! ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు.. తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైందనే వాదన వినిపిస్తోంది. ఆయన రాజకీయంగా ఇప్పుడు ఎటూ కాకుండా నాలుగురోడ్ల మధ్యలో నిలబడ్డారు. 2018 ఎన్నికల్లో వచ్చిన ఓటమి ఆయనను రాజకీయంగా దెబ్బతీస్తోందనే వాదన వినిపిస్తోంది.
టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లోకి మారిన తుమ్మల.. తొలుత సీఎం కేసీఆర్ అనుగ్రహాన్ని బాగానే సొంతం చేసుకున్నారు. మంత్రి పదవిని కూడా తీసుకున్నారు. అంతేకాదు.. కేసీఆర్ ఎక్కడకు వెళ్లినా తుమ్మల ఉండేవారు.
ఢిల్లీ నుంచి గల్లీ దాకా తుమ్మలతో కేసీఆర్ ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నారు. కట్ చేస్తే.. 2018 ఎన్నికల తర్వాత.. తుమ్మలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. పాలేరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు.
ఇక, అప్పటి నుంచి తుమ్మల రాజకీయాలకు బ్రేకులు పడుతూ వచ్చాయి. ఉపేందర్ అటు కేసీఆర్, ఇటు కేటీఆర్‌కు చేరువ కావడంతో తుమ్మలకు వారికి దూరం పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామాలకు తోడు ఇప్పుడు స్థానిక నాయకులు కూడా దూరం పెడుతున్నారు. ఇటీవల ఇద్దరికి రాజ్యసభ స్థానాలు ఇవ్వగా.. వారికి సన్మాన కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలందర్నీ పిలిచారు. కానీ తుమ్మలను మాత్రం దూరం పెట్టారు.
అయినా..తుమ్మల మాత్రం పార్టీలోనే ఉంటానని చెప్పారు. అయితే, ఎవరు మాత్రం ఆయనను పట్టించు కుంటున్నారు? అంటే ఎవరూ లేరు. పైగా సిట్టింగులకే టికెట్లు ఖాయం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పేశా రు. అంటే.. ప్రత్యక్షంగా పరోక్షంగా తుమ్మలకు సీటు దక్కే ఛాన్స్ లేదు.
పోనీ.. ఇతర నియోజకవర్గాల్లో ఇస్తారా? అంటే కామ్రెడ్లతో బంధం బలోపేతం అయిన నేపథ్యంలో వేరే వారికి ఛాన్స్ దక్కే అవకాశం లేదు. ఏతావాతా.. ఎలా చూసుకున్న తుమ్మల పరిస్థితి.. దారుణంగా మారిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.