తిరుపతి, శ్రీశైలంలో దర్శనాలకి గ్రీన్ సిగ్నల్... శ్రీకాళహస్తిలో నో ఎంట్రీ !
వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ నుండి కేంద్రం సడలింపులు ఇవ్వడంతో ..లాక్ డౌన్ కారణంగా మూసేసిన రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నీ ఓపెన్ చేయడానికి దేవాదాయ బోర్డు మెంబెర్స్ సన్నాహాలు ప్రారంభించారు. తిరుమలలో సహాయ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులకి దర్శనాలు కలిగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శన విధి విధానాలను నిర్ణయించి 8వ తేది నుండి దర్శనాలు ప్రారంభిస్తామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ క్లారిటీ ఇచ్చారు. అలాగే హుండీని తాకకుండా కానుకలను అందులో సమర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే భక్తులకు సంబంధించి అన్ని రకాల తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూస్తామన్నారు.
అయితే, తిరుపతికి అతి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం మాత్రం ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదు. శ్రీకాళహస్తి ప్రాంతం కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తుల అనుమతి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి ప్రభుత్వ ఆదేశాల జారీ వరకు భక్తులు స్వామి వారి దర్శనానికి అనుమతి నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయానికి రావద్దని తెలిపారు.
అలాగే, ఆలయంలోకి ఎప్పటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తామన్నది ఇప్పుడే చెప్పలేమని, దేవాదాయ శాఖ ఆదేశాలకి అనుగుణంగా అనుమతులు లభించిన తర్వాత గంటకు 300 మంది భక్తుల చొప్పున పరిమితంగానే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. రాహుకేతు పూజలు సంబంధించి వన్ బైక్ థర్డ్ విధానంలో అనుమతి ఉంటుందని, నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తదుపరి ప్రభుత్వ ఆదేశాలు అనుగుణంగా ఆలయంలోకి భక్తులను అనుమతించే నిర్ణయం తీసుకుంటామని వివరించారు.