'మోడీ నో ఎంట్రీ'.. తెలంగాణలో షాకిస్తున్న పోస్టర్లు

Update: 2022-11-10 11:34 GMT
మోడీ టార్గెట్ గా టీఆర్ఎస్ రాజకీయం నడుస్తోంది. కేసీఆర్, కేటీఆర్ నుంచి క్షేత్రస్థాయి నేతల వరకూ మోడీ పర్యటనలకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంటారు. హైదరాబాద్ పర్యటనలో కూడా 'సాలు మోడీ.. సంపకు మోడీ' అంటూ టీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్ మొదలుపెట్టింది. ఇక 'బైబై మోడీ ' ఫ్లెక్సీలు కూడా కలకలం రేపాయి. మరోసారి ఇప్పుడు మోడీ నవంబర్ 12న తెలంగాణలోని రామగుండంలో పర్యటన సందర్భంగా మరోసారి మోడీని టార్గెట్ చేశారు.

తెలంగాణలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయనున్నాయి. అయితే మోడీకి వ్యతిరేకంగా తాజాగా ఫ్లెక్సీలు వెలిశాయి. చేనేతపై విధించిన జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే తెలంగాణలో అడుగుపెట్టాలంటూ నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో తాజాగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

'మోడీ నో ఎంట్రీ టు తెలంగాణ' అంటూ ఫ్లెక్సీలు చెక్ పోస్ట్ తోపాటు పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ఇలా ఫ్లెక్సీలు కలకలం రేపుతుంటే మరోవైపు కార్మిక సంఘాలు , విద్యార్థి జేఏసీలు చేస్తున్న హెచ్చరికలు తెలంగాణలో మరింత కాకరేపుతున్నాయి.

మోడీ పర్యటనను టీఆర్ఎస్ సర్కార్ వివాదాస్పదం చేసింది. రామగుండంలో తెలంగాణ ప్రభుత్వానికి వాటా ఉందని.. ఇక్కడి సీఎంను పిలవకుండా అవమానించారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ కార్మిక లోకం కూడా ప్రధానిపై మండిపడుతోంది. మోడీ పర్యటనను అడ్డుకుంటామని కార్మిక సంఘాలు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వామపక్ష, విద్యార్థి నేతలు సైతం మోడీ పర్యటనను అడ్డుకుంటామని ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

ఇక ఇప్పటికే రామగుండం ఎరువుల ప్యాక్టరీ ప్రారంభమై ఉత్పత్తి కూడా మొదలయ్యాక ఇప్పుడు దానికి ప్రారంభించడం ఏంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News