పార్టీ లేదు గాడిద గుడ్డు లేదు.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలుసు?

Update: 2022-08-03 07:02 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు లేదా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు ఇదే విష‌య‌న్ని ఆఫ్ ది రికార్డుగా మీడియాతో చెబుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు వివిధ స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తుండ‌టంతో ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిర‌వుతున్నార‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేక చేతులెత్తేస్తున్నార‌ని అంటున్నారు.

తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా వైఎస్సార్సీపీ జ్యోతుల చంటిబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీ లేదు.. గాడిద గుడ్డు లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించార‌ని అంటున్నారు. సొంత ప్ర‌భుత్వంపైనే ఆయన సెటైర్లు వేశార‌ని చెబుతున్నారు. ఎప్పుడు ఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో ఎవ‌రికి తెలుసంటూ కామెంట్లు చేశార‌ని స‌మాచారం. వైఎస్సార్సీపీలో తాను ఏమైనా శాశ్వ‌త‌మా?..

రేప‌టి రోజు ఎవ‌రు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో.. ఎవ‌రికి తెలుస‌ని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పింఛ‌న్ తీసుకునే సామాన్యులు ఆదాయ ప‌న్ను ఎలా క‌ట్ట‌గ‌ల‌ర‌ని ఆయ‌న త‌మ ప్ర‌భుత్వంపైనే సెటైర్లు వేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా జ్యోతుల చంటిబాబు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. 2009లో తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఆయ‌న మూడో స్థానంలో నిలిచారు. ఇక 2014లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి జ్యోతుల నెహ్రూ చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

ఇక 2019 టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరి ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి గెలుపొందారు. మ‌ళ్లీ చంటి బాబు త‌న సొంత పార్టీ టీడీపీ వైపు చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చేసిన కామెంట్లు వైర‌ల్ గా మారాయి.
Tags:    

Similar News