ఎర్రకోట దగ్గర్ స్వచ్ఛభారత్ నిల్

Update: 2015-08-16 04:52 GMT
ప్రధానమంత్రి మానసపుత్రిక అయిన స్వచ్ఛభారత్ అమలు ఎంత దారుణంగా ఉందన్న విషయం తాజాగా కళ్లకు కట్టినట్లుగా కనిపించింది. పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట దగ్గర జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగురవేయటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అధికార.. విపక్షానికి చెందిన ముఖ్యనేతలు.. పలువురు వీవీఐపీలు హాజరుకావటం తెలిసిందే.

మరి ఇంత భారీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. స్వచ్ఛ భారత్ స్ఫూర్తి అస్సలు కనిపించలేదు. ఎర్రకోటలో జరిగిన వేడుకలు నిర్వహించిన ప్రాంతంలో డస్ట్ బిన్లు అన్నవి ఏర్పాటు చేయకపోవటం.. స్వచ్ఛభారత్ గురించి పద్దగా పట్టించుకోని ప్రజలు.. కరపత్రాలు.. వాటర్ బాటిళ్లు ఇలా అన్నింటిని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో.. పంద్రాగస్టు వేడుకలు నిర్వహించిన ప్రాంతమంతా చెత్తతో నిండిపోయింది.

ఓ పక్క స్వచ్ఛభారత్ కు చిన్నారులే బ్రాండ్ అంబాసిడర్లు కావాలని.. ఇళ్లల్లో శుభ్రత బాధ్యతను వారు తీసుకోవాలంటూ ప్రధాని ఎర్రకోట సాక్షిగా పిలుపునిస్తే.. ఆయన ప్రసంగం చేసిన చోటే.. స్వచ్ఛభారత్ ఎవరికి పట్టకపోవటం గమనార్హం.
Tags:    

Similar News