సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. సమీకరణాలు మారిపోతున్నాయి. పార్టీలో అసమ్మతి గళాన్ని వినిపిస్తూ.. వైరిపక్షానికి అనుకూలంగా వ్యవహరించే నేతలకు చెక్ పెట్టే ప్రక్రియను బీజేపీ మొదలు పెట్టినట్లుంది. తనను తూర్పార పట్టే శివసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. అదే సమయంలో సొంత పార్టీకి చెందిన అసమ్మతి నేతలపై మాత్రం చర్యలు తీసుకునే దిశగా పావులు కదుపుతోంది.
బీజేపీఎంపీగా ప్రాతినిద్యం వహిస్తూ.. ఏ మాత్రం అవకాశం చిక్కినా మోడీ సర్కారుపై విమర్శల వర్షం కురిపించే ప్రముఖ బాలీవుడ్ నటుడు.. షాట్ గన్ గా అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే శతృఘ్న సిన్హాకు షాకిచ్చే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా బిహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. శతృఘ్న సిన్హాకు ఈసారి పార్టీ టికెట్ ఇచ్చేది లేదని తేల్చారు.
ఇటీవల ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి నిర్వహించిన దీక్షకు వెళ్లిన శతృఘ్న సిన్హా వ్యవహారం పార్టీలో కలకలం రేపింది. మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టటం చేసే షాట్ గన్ కు టికెట్ నో చెప్పేసిన క్రమంలో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
బీజేపీఎంపీగా ప్రాతినిద్యం వహిస్తూ.. ఏ మాత్రం అవకాశం చిక్కినా మోడీ సర్కారుపై విమర్శల వర్షం కురిపించే ప్రముఖ బాలీవుడ్ నటుడు.. షాట్ గన్ గా అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే శతృఘ్న సిన్హాకు షాకిచ్చే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా బిహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. శతృఘ్న సిన్హాకు ఈసారి పార్టీ టికెట్ ఇచ్చేది లేదని తేల్చారు.
బిహార్ లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీగా వ్యవహరిస్తున్న శతృఘ్న సిన్హాకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. అదే సమయంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీకి తలుపులు తెరిచి ఉంచినట్లు చెప్పారు.