విశాఖలో దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసులో బిగ్ బాస్ సెలెబ్రెటీ, దర్శకుడు నూతన్ నాయుడు భార్య ప్రియదర్శిని సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఉడిపిలో నూతన్ నాయుడిని అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఈ కేసులో నూతన్ ప్రమేయం లేదని అనుకున్నారు.
కానీ తన భార్యను రక్షించే ప్రయత్నం నూతన్ చేశాడని.. ఈ క్రమంలోనే పోలీసులు అరెస్ట్ చేసిన రోజే నెట్ కాల్ ద్వారా తన భార్యకు నూతన్ నాయుడు ఫోన్ చేసినట్టు పోలీసులు కనిపెట్టారు. అలాగే డాక్టర్ సుజాత, డాక్టర్ సుధాకర్, డాక్టర్ వాసుదేవ్ కు నూతన్ ఫోన్ చేసిన తాను సీఎంవో స్పెషల్ సెక్రటరీ పీవీ రమేశ్ నని చెప్పుకొని కేసును ప్రభావితం చేసే పనిచేశాడు. డాక్టర్ సుధాకర్ కు అనుమానం వచ్చి ఏకంగా డైరెక్ట్ గా సీఎంవో కార్యదర్శి పీవీ రమేశ్ కు ఫోన్ చేయగా.. అసలు విషయం బయటపడింది.
నూతన్ నాయుడు ఏకంగా ఏపీచీఫ్ సెక్రెటరీ ఏపీ సీఎంవో పేరుతో పోలీసులను, వైద్యులను తప్పుదోవ పట్టించాడని తెలిసి పోలీసులు కాల్ డేటా ఆధారంగా కర్ణాటకలోని ఉడిపిలో పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇంకా ఇలా ఎవరినైనా బెదిరించాడా అన్నది విచారిస్తున్నారు.