అమ్మ జయలలిత మృతితో అధికార అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి తెలిసిందే. నాటకీయంగా చోటు చేసుకున్న పలు అంశాల నేపథ్యంలో అమ్మ పార్టీ రెండు ముక్కలు కావటం.. ఒకదానికి అమ్మకు అత్యంత విధేయుడైన పన్నీర్ ఒక వర్గం.. అమ్మ నెచ్చెలి శశికళ మరో వర్గం కావటం.. ఇరువురి మధ్య పవర్ పోరు అంకతకంతకూ ముదరటం తెలిసిందే.
అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమైన ప్రస్తుతం జైల్లో ఉంటున్న శశికళ.. తన బంటుగా పళనిస్వామిని తమిళనాడు ముఖ్యమంత్రిగా చేయటం.. తన బంధువు దినకరన్ ను పార్టీ వ్యవహారాలు చూసేందుకు నియమించారు. అయితే.. పార్టీ ఎన్నికల గుర్తు అయిన రెండాకుల్ని తమ సొంతం చేసుకోవటానికి కేంద్ర ఎన్నికల సంఘాన్నిబుట్టలో వేసుకునేందుకు రూ.50 కోట్లతో పావులు కదిపి అడ్డంగా బుక్ అయిన ఆయన.. ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలోచిన్నమ్మ అండ్ కోను పార్టీ నుంచి దూరం చేయటం.. ముఖ్యమంత్రి పీఠాన్ని తనకు దఖలు పరిచేలా పన్నీర్ పావులు కదిపారు. అయితే.. దీనికి బ్రేకులు వేస్తూ పళనిస్వామి రివర్స్ గేర్ కావటంతో.. తమిళనాడు అధికారపక్షంలో ఏర్పడ్డ సంక్షోభం అంతకంతకూ పెరుగుతూ ఉంది. రెండుగా చీలిన పార్టీని ఒకటిగా చేసేందుకు జరిగే ప్రయత్నాలు పళనిస్వామి పుణ్యమా అని ఒక దశ వరకూ వచ్చి ఆగిపోయాయి.
అమ్మ మెచ్చిన తనను ముఖ్యమంత్రిని చేయాలని.. ప్రజల్లో తన మీదనే అభిమానం ఉందన్న భావనను వ్యక్తం చేస్తూ.. పన్నీర్ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులు పర్యటించేందుకు యాత్ర షురూ చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా కాంచీపురంలో యాత్ర మొదలైంది. ఈ యాత్రకు పన్నీర్ వర్గం ఆశించినట్లే ప్రజల్లో విశేష స్పందన రావటమే కాదు.. ఆయన ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన రావటం గమనార్హం. ప్రజల్లో అమ్మ మీద ఉన్న అభిమానం.. అదే సమయంలో చిన్నమ్మ మీద ఉన్న వ్యతిరేకతను బయటకుతెలియజేసేలా చేయటం.. తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకోవటం.. అమ్మ అసలుసిసలు వారసుడిగా ప్రజామోదం ఉన్న నాయకుడిగా అవతరించాలన్నది పన్నీర్ వ్యూహంగా చెబుతున్నారు. ఆయన అంచనాలకుతగ్గట్లే ప్రజల నుంచి పన్నీర్ కు సానుకూల స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యేల బలం లేకున్నా.. ప్రజాబలం పుష్కలంగా ఉందన్న విషయాన్ని తన తాజా యాత్రతో నిరూపించాలన్న పట్టుదలతో పన్నీర్ ఉన్నారు.
తన ప్రసంగంలో భాగంగా అమ్మ తనను పొగిడిన అంశాల్ని ప్రస్తావిస్తూ.. అమ్మ బాటలో తాను నడవాలన్న భావనను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటం.. అమ్మ వారసుడు తానేనన్న విషయాన్ని ప్రజల మనసుల్లో రిజిష్టర్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు పన్నీర్. దూకుడుగా ఆయన చేస్తున్న రాష్ట్ర పర్యటన తమిళనాడురాజకీయాల్లో ప్రభావితం చేయటం ఖాయమంటున్నారు. తొలి రోజు టూర్ కు ప్రజల్లో వచ్చిన స్పందనతో పన్నీర్ మరింత ఆనందానికి గురి అవుతూ.. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లాలని డిసైడ్ కావటం కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/