‘గొడవ’ మీద పెద్దన్న రియాక్షన్ ఇదే..

Update: 2016-09-05 05:53 GMT
అనుకోని విధంగా అవమానం ఎదురైతే ఉడికిపోవటం సహజం. సగటు జీవే ఓ రేంజ్ లో మండిపడితే.. ఇక ప్రపంచానికే పెద్దన్న లాంటి వ్యక్తికి స్వయంగా అవమానానికి గురైతే ఎంత ఒళ్లు మండుతుంది? అలాంటి వేళ ఆ స్థాయి నాయకుడు ఎలా రియాక్ట్ అవుతారు? అన్నది పెద్ద ప్రశ్న. ప్రపంచ పెద్దన్నను అవమానించాలని.. గొడవ పెట్టుకోవాలన్న ఆలోచన చేయటానికి కూడా ఇష్టపడరు. కానీ.. అందుకు భిన్నంత తన దేశానికి అతిధిగా వచ్చిన పెద్దన్నను ఎంతలా అవమానించాలో అంతలా అవమానించిన చైనాపై అమెరికా అధ్యక్షుడు ఒబామా హుందాగా రియాక్ట్ అయ్యారు.

మనసులో ఎంత మండుతుందో కానీ.. మాటల్లో మాత్రం అలాంటివేమీ బయటకు రాకుండా జాగ్రత్త పడిన ఆయన.. చైనాపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికిన విషయాన్ని మొదలుకొని.. అమెరికా అధికారులతో చైనా అధికారులు పెట్టుకున్న గొడవపై ఒబామా స్పందించారు.

తాజా ఉదంతంతో ఇరు దేశాల మధ్యనున్న మానవహక్కులు.. పత్రికా స్వేచ్ఛ లాంటి అంశాల్లో ఇరుదేశాలకు మధ్యనున్న తేడా బయటపెట్టిందంటూ డ్రాగన్ దేశానికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా వ్యాఖ్యలుచేశారు. వైట్ హౌస్ లాంటి అత్యంత శక్తి ఉన్న అధినేత ప్రయాణాన్ని చూసి ఏ దేశమైనా జడుసుకోవటం సహజమేనని వ్యాఖ్యానించిన ఆయన ఇలాంటి ఘటనలు ఇతర దేశాల్లో జరుగుతాయంటూ చైనా గొడవను చిన్నదిగా చెప్పే ప్రయత్నం చేశారు.
Tags:    

Similar News