రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా అమెరికా జపాన్ మీద వేసిన అణుబాంబును ఆ దేశ ప్రజలు ఎప్పటకీ మర్చిపోలేరు. ఈ సంఘటన జరిగి దాదాపు ఏడు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటకీ ఆ బాంబుల ప్రభావం జపాన్ మీద ఎంతో ఉంది. ఆ అణు ప్రభావంతో ఇప్పటకీ జపాన్ లో పంటలు పండవు. చాలా మంది తరతరాలుగా ఆ ప్రభావానికి లోనయ్యి వారికి పుట్టే బిడ్డలు కూడా అంగవైకల్యం - మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. ఏడు దశాబ్దాల క్రితం అమెరికా వేసిన ఆ అణుబాంబు ఎఫెక్ట్ జపాన్ ప్రజలతో పాటు ఆ దేశ అభివృద్ధి మీద ఇంకా కంటిన్యూ అవుతోంది.
ఏడు దశాబ్దాల పాటు అమెరికా మీద రగిలిపోతున్న జపాన్ దేశీయుల సెగ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు తగలనుంది. 1945 నుంచి జపాన్ ప్రజలు ఈ సంఘటనపై అమెరికా నుంచి క్షమాపణలు కోరుతూనే ఉన్నారు. తన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఒబమా ఈ నెల 27న సెంట్రల్ జపాన్ లో జరిగే జీ-7 సమావేశానికి హాజరవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన అణుబాంబుకు గురైన హిరోషిమా పట్టణంలో కూడా పర్యటిస్తారు.
ఏడు దశాబ్దాల నాడు అణుబాంబు దాడికి గురై ఇప్పటకీ బాధను అనుభవిస్తున్న పలువురు బాధితులు - కొందరు జపాన్ ప్రతినిధులు హిరోషిమాకు వచ్చే ఒబామాను కలవాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా తాము ఎలా అన్యాయానికి గురైంది చెప్పడమే కాకుండా వారు తమ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
టోక్యోలోని ఓ జాతీయ సంఘానికి చెందిన ఇద్దరు నాయకుల ఆధ్వర్యంలో అణుబాంబు బాధితులు ఒబామాను కలవనున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా చరిత్రలో హిరోషిమాను సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలవబోతున్నారు. ఒబామా అణుబాంబు బాధితులకు, జపాన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒబామా వారిని మీట్ అయినా క్షమాపణలు చెప్పే ఛాన్స్ లేదని వాషింగ్టన్ అధికారులు చెపుతున్నారు. మరి ఒబామా ఏం చేస్తారోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.