భారతలోకి ఒమిక్రాన్ ఎంట్రీ: కేంద్ర ప్రభుత్వం

Update: 2021-12-02 12:14 GMT
అనుకున్నట్లే జరిగింది. ఒమిక్రాన్.. మొత్తానికి భారత్ లో ప్రవేశించింది. గత వారం రోజులుగా దీనిపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కర్ణాటకలో రెండు కేసులు నమోదు కావడంతో దేశ ప్రజల్లో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. విదేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన ఇద్దరిలో ఈ వేరియంట్ ను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. వీరిలో ఒకరి వయసు 66 ఏళ్లు కాగా.. మరొకరు 46 ఏల్లు. అయితే వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. తొలుత వీరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఆ శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ కోసం పంపించారు. దీంతో వారిలో సార్స్ కోవ్-2 జోనోమిక్స్ కన్సార్టియం నిర్దారించింది.

ఒమిక్రాన్ సోకినీ ఈ ఇద్దరిలో స్వల్ప లక్షణాలున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది. కానీ దీని వ్యాప్తి మొదటి వేరియంట్ కంటే ఐదు రేట్లు ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని అంటున్నారు. విదేశాల నుంచి ఎవరూ వచ్చినా వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశామన్నారు. నెగెటివ్ వచ్చినా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనన్నారు. ఇక జీనోమ్ సీక్కవెన్సింగ్ కోంస దేశ వ్యాప్తంగా 37 ప్రయోగ శాలలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ పరీక్షల్లో పాజిటివ్ వస్తే ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేశామన్నారు. నెగెటివ్ వచ్చినా క్వారంటైన్లో ఉండాల్సిందేనన్నారు.

దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్.. ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాలకు పాకినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 337 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయన్నారు. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 నమోదయ్యాయన్నారు. అలాగే హాంకాంగ్ 7, ఇజ్రాయిల్ 2, యూకే 32, నెదర్లాండ్స్ 16, ఆస్ట్రేలియా 8, డెన్మార్క్ 6, ఇటలీ 4, కెనడా 7, స్వీడెన్ 4, స్పెయిన్ 2, పోర్చుగల్ 13, జపాన్ 2, ప్రాన్స్ 1, ఘనా 33, దక్షిణ కొరియా 3, నైజీరియా 3, బ్రెజిల్ 2, నార్వే 2, అమెరికా, సౌదీ అరేబీయాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.

అయితే దక్షిణాఫ్రికాలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. మూడు, నాలుగు రోజుల్లోనే కొవిడ్ కేసులు అత్యధికంగా పెరిగాయి నిన్న ఒక్కరోజే 9 వేల కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య రెట్టింపుగా ఉందాని అక్కడి జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రం తెలిపింది. ఇక్కడ కొవిడ్ పాజిటివ్ రేటు 17 శాతానికి పెరగడం ఆందోళన వ్యక్తమవుతోంది. నవంబర్ మొదటి వారంలో కేవలం 200 మాత్రమే ఉన్న కేసులు రెండో వారం నుంచి భారీగా పెరిగాయి. బుధవారం 8561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భవిష్యత్తులో మూడింతలు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అయితే కేసులు పెరిగినకొద్ది వాటిని కొత్త వేరియంట్ పై కూా ముమ్మరం చేయాలని అంటున్నారు.

ఇక నుంచి కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ తమ పనులు చేసుకోవాలన్నారు. ఏమాత్రం అజాగ్రత్త పాటించినా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అయితే ఆందోళన పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలని తెలిపారు. ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. గుంపులుగా ఉండకుండా అత్యవసర కార్యక్రమాలకు హాజరైతే మేలని కేంద్ర ఆరోగ్య అధికారులు సూచించారు.
Tags:    

Similar News