కరోనా ముప్పు మరోసారి ముంచుకొస్తోంది. కబళించడానికి రెడీ అవుతోంది. దక్షిణాఫ్రికా దేశంలో వెలుగుచూసిన కరోనా రకం ‘ఓమిక్రాన్’ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ కు కారణమైన వైరస్ రకం కంటే ఇది పది పదిహేను రెట్ల ఎక్కువ తీవ్రమైన కావడంతో కేంద్రప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది.
ఓమిక్రాన్ వేరియంట్ భయాందోళనల మధ్య కేంద్రప్రభుత్వం అప్రమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీచేసింది.
అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కరోనా పరీక్షలు పెంచాలి. హాట్ స్పాట్ లను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సాంపిల్స్ వెంటవెంటనే పంపేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కేంద్రం గైడ్ లైన్స్ లో సూచించింది.
ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో క్షుణ్ణంగా కోవిడ్ పరీక్షలు చేయాలని కేంద్రం సూచించింది. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు సులభతరం చేసే ప్రణాళికలపైనా సమీక్ష జరపాలని అధికారులను ఆదేశించింది.ముఖ్యంగా ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
కొత్త వేరియంట్ గురించి రాష్ట్రాలు, జిల్లాస్థాయి అధికారులకు అవగాహన కల్పించేందుకు అధికారులు వారితో మాట్లాడుతూ ఉండాలని పేర్కొన్నారు. రెండో డోసు తీసుకోని వారిని గుర్తించి వెంటనే అందించడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.