మోడీపై రూపాయి పంచ్ అదిరిపోయింది!

Update: 2018-08-15 05:52 GMT
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ప్ర‌శ్నించే వాడి చేతికి ప‌వ‌ర్ వ‌స్తే బాగుంటుంది. కానీ.. కొన్నాళ్ల‌కు వారిని సైతం ప్ర‌శ్నిస్తార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అధికారానికి దూరంగా ఉన్న‌ప్పుడు చేసే వ్యాఖ్య‌లు.. ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత గుది బండ‌లుగా మారే అవ‌కాశం ఉంటుంది. ఈ విష‌యం తాజాగా చేసిన ట్వీట్ స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు.. విప‌క్షంగా తాను సంధించిన అస్త్రం ఇప్పుడు మోడీకి  చిక్కులు తెచ్చి పెట్టింద‌ని చెప్పాలి.

యూపీఏ హ‌యాంలో రూపాయి కుంగుబాటు మీదా.. డాల‌ర్ తో మార‌కం పోల్చిన‌ప్పుడు త‌గ్గిన‌ప్పుడు మోడీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆయ‌న‌కు కొత్త ఇబ్బందిని తెచ్చి పెట్టాయి. చ‌రిత్ర‌లో ఇంత‌కు ముందెప్పుడూ లేని రీతిలో డాల‌ర్ తో రూపాయి విలువ రూ.70ను దాటిన నేప‌థ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు మోడీ ప‌రివారాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

రూపాయి విలువ ప‌డిపోతుంటే.. యూపీఏ ప్ర‌భుత్వం ఏం చేస్తోందంటూ 2013లో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న మోడీ ప్ర‌శ్నించిన తాలూకు వీడియోను తాజాగా రాహుల్ పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియోసోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని రీతిలో రూపాయి క‌నిష్ఠ‌స్థాయికి ప‌డిపోవ‌టం ద్వారా మ‌న రూపాయి సుప్రీం నేతపై అవిశ్వాస ఓటు వేసిందంటూ మోడీకి పంచ్ వేశారు.

ఈ సంద‌ర్భంగా  గ‌తంలో రూపాయి విలువ ప‌డిపోవ‌టాన్ని త‌ప్పు ప‌డుతూ చేసిన స్పీచ్ ను ట్వీట్ చేసింది. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు వంద అన‌టం కామ‌న్. కానీ.. తాము అన్న మాట‌ల్ని తాము అధికారంలో ఉన్న‌ప్పుడు వేలెత్తి చూపించే ప‌రిస్థితి తెచ్చుకుంటే తిప్ప‌లు త‌ప్ప‌వు. ప్ర‌ధాని మోడీకి ఇప్పుడు అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News