శుభవార్త : దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనాతో పోరాడే యాంటీబాడీలు ఉన్నాయట !
దేశంలో కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ కూడా 60 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 లక్షలు దాటిపోయింది. అలాగే 20 లక్షల మంది కరోనా నుండి కోలుకొని , హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సమయంలోనే జాతీయ స్థాయి ప్రైవేట్ లేబరేటరీ ఓ శుభవార్త చెప్పింది. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా ను ఎదుర్కొనే .. యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. దీని బట్టి ఇప్పటికే దేశంలో చాలామంది కరోనా భారిన పడి , కోలుకున్నట్టు తెలిపింది. కరోనాను అడ్డుకునేటప్పుడు తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి ఉండొచ్చని తమ డేటా సూచిస్తోందని లేబరేటరీ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ సంస్థ దేశంలోని పలు నగరాల్లో సర్వేలు నిర్వహించి, యాంటీబాడీ టెస్టులు శాతాలను నమోదు చేశారు. పుణె లో 50శాతం సెరో పాజిటివిటీ కనిపించింది. అలాగే, ముంబైలోని మురికివాడల్లో 57శాతం, అలాగే, ఢిల్లీలో 23శాతం సెరో పాజిటివిటీ కనిపించింది. ఏ వ్యక్తి శరీరంలో అయినా యాంటిబాడీస్ ఉన్నాయి అంటే, కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి అతడిలో ఉందని అర్థం.క్కువమందిలో యాంటిబాడీలు ఉన్నట్టు అయితే కరోనా వైరస్ కు వ్యతిరేకంగా సామూహిక రోగనిరోధక శక్తి ఏర్పడటానికి దారితీస్తుంది.మంద రోగనిరోధక శక్తికి భారత్ ఇంకా చాలా దూరంలో ఉంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో మంద రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ముంబైలోని ధారవి మురికి వాడ. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్లమ్. ఏప్రిల్ మే నెలల్లో ఇక్కడ కరోనా వైరస్ విలయతాండం చేసింది. కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. అలాంటి ధారవిలో గత రెండు నెలలుగా ఒక్క కరోనా వ్యాప్తి కేసు కూడా నమోదు కాలేదు. సడెన్ గా అక్కడ కేసులు జీరో అయ్యాయి. దీనికి కారణం యాంటీబాడీలు అని నిపుణులు చెప్తున్నారు.
మన దేశంలో ఇప్పటికే 18కోట్ల మంది తమ శరీరాల్లో యాంటిబాడీస్ ను రూపొందించుకొని ఉంటుంది అని, ఇటీవలే థైరో కేర్ అనే సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో టెస్టులు చేసిన జనాభాలో 29శాతం, మహారాష్ట్రలో 20శాతం జనాభాలో సెరో పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ముంబైలో 27శాతం, నవీ ముంబైలో 21శాతం, విలే పార్లీలో 42శాతం, వర్లీలో 41శాతం, డోంగ్రీలో 39శాతం సెరో పాజిటివిటీ ఉన్నట్టు గుర్తించారు. ప్రతి చోట 45 నుంచి 50శాతం వరకు పాజిటివిటీ ఉన్న కారణంగా వైరస్ ప్రభావం తగ్గిపోతుందన్నారు. మన దేశంలో ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు ముందుగా మంద రోగనిరోధక శక్తిని సంతరించుకుంటాయని బెంగళూరుకి చెందిన నిపుణుడు గిరిధర్ బాబు చెప్పారు.