జ‌గ‌న్‌... ఏ ట్రూ స్టేట్స్‌ మ‌న్‌!

Update: 2018-11-06 11:47 GMT
సీన్ 1:  ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత సీట్లో కూర్చున్న జ‌గ‌న్‌... అధికార ప‌క్షంపైకి దూసుకువ‌చ్చేలా త‌న‌దైన శైలితో టీడీపీ నేత‌ల‌కు వ‌ణుకు పుట్టించేశారు. జ‌గ‌న్ నోట నుంచి వ‌చ్చే తూటాల్లాంటి మాట‌లు - ఆవేశ‌పూరితంగా సంధించే కౌంట‌ర్ల‌కు టీడీపీ స‌ర్కారు దొడ్డిదారి స‌మాధానాలిచ్చి త‌ప్పించుకునే య‌త్నం చేసింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోయే నేత‌గా జ‌నాల‌కు క‌నిపించారు. మొత్తంగా వైరివ‌ర్గంపై ఎగ‌సిప‌డే నేత‌గానే జ‌గ‌న్ క‌నిపించారు.

సీన్ 2:  విశాఖ ఎయిర్ పోర్టులో ఏకంగా త‌న‌పై ఓ వ్య‌క్తి క‌త్తితో దాడి చేసి ప్రాణాలు తీయాల‌ని చూస్తే... ఆ దాడి నుంచి లాఘ‌వంగా త‌ప్పించుకున్న జ‌గ‌న్... భుజం నుంచి నెత్తురొడుతున్నా న‌వ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. ఆ త‌ర్వాత త‌న‌కేమీ కాలేద‌ని - పార్టీ శ్రేణులు - ప్ర‌జ‌లు సంయ‌మ‌నం పాటించాల‌ని ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చేసి చికిత్స తీసుకున్నారు. ఓ వారం త‌ర్వాత త‌న‌పై జ‌రిగిన దాడిపై - ఆ దాడి చేయించిన వారిపై న్యాయ పోరాటానికి శ్రీ‌కారం చుట్టారు.

ఈ రెండు సీన్లకు మ‌ధ్య స‌మ‌యం దాదాపు ఏడాది. నిజ‌మే... జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టి నేటికి స‌రిగ్గా ఏడాది. త‌న సొంత జిల్లా - ప్ర‌జ‌లు త‌మ కుటుంబ స‌భ్యుడిగా భావిస్తున్న త‌న తండ్రి స‌మాధి ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని 11 జిల్లాల‌ను దాటేసి... 12వ జిల్లా అయిన విజ‌య‌న‌గ‌రంలో కొన‌సాగుతోంది. ఈ జిల్లాలో యాత్ర ముగించుకుని శ్రీ‌కాకుళంలో కాలుపెట్టే జ‌గ‌న్‌... ఆ జిల్లాలోని ఇచ్ఛాపురంలో త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌కు ముగింపు ప‌ల‌క‌నున్నారు. ఈ ఏడాది వ్య‌వ‌ధిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెరువక జ‌గ‌న్ త‌న యాత్ర‌ను ముందుకు సాగిస్తున్న తీరు నిజంగానే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంద‌నే చెప్పాలి. త‌న‌కు మంచి ప‌ట్టున్న రాయ‌ల‌సీమ‌లో యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డితే... అదేదో ఆయ‌న‌కు అనుకూల‌మైన ప్రాంతంగానే ఇత‌ర రాజ‌కీయ పార్టీలు భావించాయి.

అయితే రాయ‌ల‌సీమ‌ను దాటేసి కోస్తాంధ్ర‌లో అడుగుపెట్టిన జ‌గ‌న్‌కు అక్క‌డి ప్ర‌జ‌లు రాయ‌ల‌సీమ వాసుల కంటే కూడా మించిన రీతిలో ఆద‌రించారు. గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌ల‌కు పోటెత్తిన జ‌న‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్ప‌కోవాలి. అస‌లు త‌మ‌కు కంచుకోట‌గా ఉన్న గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నాన్ని చూసిన అధికార పార్టీ టీడీపీ నేత‌ల‌కు గుండెలు గుభేలుమ‌న్నాయి. ఆ త‌ర్వాత కృష్ణా - ఉభ‌య గోదావ‌రి - విశాఖ జిల్లాల్లోనూ జ‌గ‌న్ యాత్ర‌కు జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చారు. త‌ర‌లివ‌స్తున్నారు కూడా. యాత్ర ముగిసేదాకా జ‌గ‌న్ యాత్ర‌కు జ‌న నీరాజ‌నానికి ఏమాత్రం ఢోకా లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా యాత్ర మొద‌లుపెట్ట‌క‌ముందు... త‌న యాత్ర ఈ మాత్రం స‌క్సెస్ అవుతుంద‌ని జ‌గ‌న్ కూడా ఊహించి ఉండ‌ర‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

స‌రే యాత్ర స‌క్సెస్‌ ఫుల్‌ గానే సాగుతోంది. అయితే మ‌రి మ‌నం ముందుగా చెప్పుకున్న రెండు స‌న్నివేశాల్లో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. నాడు అధికార ప‌క్షంపై త‌న‌దైన శైలి మాట‌ల తూటాలను పేల్చిన జ‌గ‌న్‌... త‌న‌పై ఏకంగా హ‌త్యాయ‌త్నం జ‌రిగితే... న‌వ్వుతూ ఎలా ముందుకు సాగిపోయారు? ఇక్క‌డే ఓ ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌ను చెప్పుకోవాలి. యాత్ర‌కు ముందు జ‌గ‌న్ త‌న భవిష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌పై ఓ మేర అవ‌గాహ‌న ఉన్నా... యాత్ర సాగుతున్న కొద్దీ ఆయ‌న నిఖార్సైన రాజ‌కీయ వేత్త‌గా ఎదిగారు. అసెంబ్లీలో అధికార ప‌క్షాన్ని ఇరుకున‌పెట్టేలా మాట్లాడిన జ‌గ‌న్‌... ఒక సంయ‌మ‌నం - ప‌రిణ‌తి చూపుతూనే బ‌హిరంగ స‌భ‌ల్లోనూ టీడీపీ స‌ర్కారును చీల్చి చెండాడుతున్నారు. అయితే ఆ విధానంలో జ‌గ‌న్ తీరు ఏ ఒక్క‌రూ ఊహించ‌లేనంత ప‌రిణ‌తి క‌నిపించింది.

నాడు జ‌గ‌న్ మాట‌లో ఆవేశం క‌నిపిస్తే... ఇప్ప‌టి జ‌గ‌న్ విమ‌ర్శ‌ల్లో తార్కికం క‌నిపిస్తోంది. యాత్ర పొడ‌వునా జ‌నం స‌మ‌స్య‌ల‌ను చాలా ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నిస్తూ... జ‌నం గోడును వింటూ ముందుకు సాగుతున్న జ‌గ‌న్ ఆయా స‌మ‌స్య‌ల‌పై అప్ప‌టికప్పుడే స్పందిస్తున్న తీరు నిజంగానే ఆశ్చ‌ర్యంగా క‌నిపించ‌క మాన‌దు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితుల‌పై ప‌ట్టు ఎంత‌గా సాధించారంటే... ఏళ్ల త‌ర‌బ‌డి మంత్రులు - ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన నేత‌లు కూడా ఆయా స‌మ‌స్య‌ల‌పై స్పందించేందుకు త‌ట‌ప‌టాయిస్తుంటే...  జ‌గ‌న్ కు నోటి మాట‌తో చెప్పేసే స్థితికి చేరారు. ఒక పార్టీ అధ్య‌క్షుడు నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల‌పై అంత సూక్ష్మ‌స్థాయిలో స్పందించ‌డం మామూలు విష‌యం కాదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ రాజ‌కీయం చేయ‌డానికే స‌మ‌యం ఉండ‌దు. కానీ అలాంటిది జ‌గ‌న్ రాష్ట్రంలో విప‌రీత‌మైన అవ‌గాహ‌న సాధించారు.
అధికారంలోకి వ‌స్తే అది చేస్తాం - ఇది చేస్తామ‌ని ఏది ప‌డితే అది హామీ ఇచ్చేయ‌కుండా స‌మ‌స్య తీవ్ర‌త‌ను స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేసి - ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఏ మేర‌కు సాధ్య‌మ‌న్న విష‌యాన్ని కూడా జ‌గ‌న్ వివ‌రిస్తున్న తీరు నిజంగానే ఆక‌ట్టుకుంటోంది. కాపుల విష‌యంలో గాని - ఎన్టీఆర్ పేరు ప్ర‌క‌టించ‌డంలో గాని - జ‌నాల‌తో మ‌మేకం అవ‌డం విష‌యంలో గాని - ప్ర‌తిప‌క్షాల బూతుస‌హిత విమ‌ర్శ‌ల‌ను చుర‌క‌ల‌తో ఎదుర్కొనే విష‌యంలో గాని... జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఆయ‌న‌ను ప‌రిపూర్ణ రాజ‌కీయ‌వేత్త‌గా మార్చేసింద‌న్న విశ్లేష‌ణ‌లు ఇప్పుడు జోరందుకున్నాయి. ప‌వ‌న్ వ్య‌వహారాన్ని ఒకే ఒక్క మాట‌తో తేల్చేశాడు జ‌గ‌న్‌. ఆ త‌ర్వాత రాష్ట్రంలో ప‌వ‌న్ ప్ర‌భ త‌గ్గుతూ రావ‌డం గ‌మనార్హం.
 
పాద‌ యాత్ర మొద‌ల‌య్యే నాడు... సీఎం కుర్చీ కోసం పాద‌యాత్ర అని విశ్లేషించిన వారే... జ‌గ‌నేంటి ఇలా అన్నీ నిజాలు మాట్లాడితే ఎలా గెలుస్తాడు అని విస్మ‌యం చెందారు. చివ‌ర‌కు ఆ నిజాయితీ ఫ‌లితం గోదావ‌రి బ్రిడ్జిపై ప్ర‌పంచం ప్ర‌త్య‌క్షంగా చూసింది. గ‌త నెల రోజులుగా వ‌స్తున్న వివిధ స‌ర్వేలు ఫ‌లితాలు ఏడాదిలో జ‌గ‌న్ ఎదిగిన తీరుకు ప్రాక్టిక‌ల్ ఎగ్జాంపుల్స్‌. 

ముఖ్యంగా హామీల విష‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హరిస్తున్న తీరు ఓ కొత్త రాజ‌కీయం. మొత్తంగా ప్ర‌జా సంక‌ల్ప‌ యాత్ర పేరును సార్థ‌కం చేసిన‌ జ‌గ‌న్‌.. రాజ‌కీయ నాయ‌కుడిగా యాత్ర మొద‌లుపెట్టి రాజనీతిజ్ఞుడిగా అవ‌త‌రించాడు అనే విశ్లేష‌ణ‌లు జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News