న్యూ ఇయర్ వేళ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రికార్డ్ బద్దలు

Update: 2022-01-02 10:30 GMT
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ జనాలు ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ రికార్డులు సృష్టించారు. మద్యం కూడా రికార్డు స్థాయిలో అమ్ముడైంది. రెండేళ్లుగా కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉండడంతో ఈ సారి సెలబ్రేషన్స్ ఎక్కువగా జరిగింది. మందుబాబులు లిక్కర్ తో ఎంజాయ్ చేస్తే.. ఫుడ్ లవర్స్ తమకు నచ్చిన ఆహారాన్ని లాగించేశారు.

డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ లో బుక్ అయిన ఆర్డర్స్ కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. న్యూఇయర్ జోష్ లో స్విగ్గీలో ఏకంగా నిమిషానికి 9500 ఆర్డర్లు రాగా.. రెండో స్థానంలో జోమాటోలో 7100 ఆర్డర్లు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్తాయిలో ఫుడ్ డెలివరీలో జరిగాయి.

2021 కొత్త ఏడాది వేడుకల్లో 5500 ఆర్డర్లు డెలివరీ చేసిన స్విగ్గీ ఈ ఏడాది పాత రికార్డును దాటేసింది. ఇక కొత్త ఏడాది ఫుడ్ డెలివరీల్లో బెంగళూరులో మొదటి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.

కరోనా నేపథ్యంలో జనాలు ఎక్కువగా హోటళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆన్ లైన్ ఆర్డర్లు వెల్లువెత్తాయి. యూపీఐ చెల్లింపులు నిన్న భారీగా జరిగాయి.

ఫుడ్ డెలివరీ యాప్ లపై హైదరాబాద్ లో బిర్యానీలకే అధిక డిమాండ్ కనిపించింది. స్విగ్గీ గణాంకాల ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా సెకనుకు దాదాపు 2 బిర్యానీలు ఆర్డర్ చేస్తే.. అది ఈ సంవత్సరం 3 బిర్యానీలకు చేరిందని తెలిపింది. దేశవ్యాప్తంగా 20 లక్షల ఆర్డర్లు చేశామని.. దీని విలువ 91 కోట్లు ఉంటుందని జొమాటో తెలిపింది. బిర్యానీలు, సమోసాలతోపాటు ఆర్గానిక్ ఫుడ్ కు ఆర్డర్లు భారీగా వస్తున్నట్టు స్విగ్గీ తెలిపింది.
Tags:    

Similar News