971 మందిలో 73 మందికే ఛాన్స్.. రూ.2కోట్ల లిస్టులో ఎవరంటే?

Update: 2019-12-04 04:40 GMT
ఐపీఎల్ సీజన్ వచ్చేస్తోంది. అలా పరీక్షలు అయిపోయిన కొద్ది రోజులకే స్టార్ట్ అయ్యే ఐపీఎల్ సీజన్ కు మరోసారి రంగం సిద్దమవుతోంది. ప్రతి ఏడాది మాదిరే.. సీజన్ ఆరంభంలో వేలాన్ని నిర్వహించటం.. పలువురిని ఎంపిక చేసుకోవటం తెలిసిందే. ఈ సీజన్ లో అవకాశం పోటీ పడే వారి సంఖ్య భారీగా పెరిగింది.  అయితే.. ఎంపిక చేసుకోవాల్సిన ఆటగాళ్ల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఈ నెల (డిసెంబరు) 19న కోల్ కతాలో జరగనుంది. మొత్తం 971 మంది ఆటగాళ్లు పోటీ పడుతుంటే.. అందులో నుంచి 73 మందిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు దక్కనుంది.  ఇందులో రూ.2 కోట్ల ధరతో కొందరు ఆటగాళ్లను ఎంపిక చేశారు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం నిర్ణయించిన బేసిక్ ధరకు కానీ.. అంతకంటే ఎక్కువ ధర పెట్టి విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజా సీజన్ కు రూ.2కోట్ల జాబితాలో ఉన్న క్రికెటర్లుగా పలువురు నిలిచారు. వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ కలిగిన ఆటగాళ్లుగా నిలిచిన వారి విషయానికి వస్తే..
%  పాట్ కమిన్స్
%  హేజల్‌వుడ్
% క్రిస్ లిన్
% మిచెల్ మార్ష్
% గ్లెన్ మాక్స్‌వెల్
% డేల్ స్టెయిన్
% ఏంజెలో మాథ్యూస్
ఈ ఆటగాళ్లను అయితే రూ.2 కోట్లకు లేదంటే అంతకంటే ఎక్కువ ధరకు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  అదే రీతిలో రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్ లో నిలిచిన ఆటగాళ్లు పలువురు ఉన్నారు. వారి విషయానికి వస్తే..
%  రాబిన్ ఉతప్ప
% షాన్ మార్ష్
% కేన్ రిచర్డ్‌సన్
% ఇయాన్ మోర్గాన్
% జేసన్ రాయ్
% క్రిస్ వోక్స్
% డేవిడ్ విల్లీ
% క్రిస్ మోరిస్
% కైలీ అబ్బాట్ తదితరులు ఉన్నారు. మరి.. వీరికి నిర్దేశించిన బేస్ ప్రైస్ కే పలుకుతారా? వేలంలో మరింత విలువ పలుకుతారా? అన్నది తేలాలంటే మరో రెండు వారాలకు పైనే వెయిట్ చేయక తప్పదు.
Tags:    

Similar News