ఆపరేషన్ టీడీపీ.. ఏపీ లో మొదలవుతోందా?

Update: 2019-11-09 14:30 GMT
ఏపీలో అఖండ మెజార్టీతో గద్దెనెక్కిన వైసీపీకి ఇప్పుడున్న టీడీపీ అస్సలు పోటీనే కాదు.. ఇప్పటికే టీడీపీనీ చాలా మంది వీడి వైసీపీ, బీజేపీ బాట పడుతున్నారు. దీంతో కుదేలైన టీడీపీని మరింత దెబ్బకొట్టడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్లాన్ రెడీ చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కశ్మీర్, అయోధ్య సమస్యలు ముగిసిపోవడంతో ఇప్పుడు బీజేపీ పెద్దాయన అమిత్ షా తన ప్రత్యర్థి టీడీపీ అధినేత ను టార్గెట్ చేసినట్టు సమాచారం.టీడీపీ నేతలే బీజేపీ లో చేరడానికి ఢిల్లీ కి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ ని దెబ్బ కొట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందర మోడీ ని ఓడించడానికి శతవిధాల ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.. ఇప్పుడు ఏపీ లో టీడీపీ ని మొత్తం హైజాక్ చేసి లాగేసి ప్రతి పక్ష హోదా పొందేందుకు బీజేపీ రెడీ అయినట్లు  కనిపిస్తోంది.

తాజాగా రెండు రోజులుగా టీడీపీ సీనియర్ మాజీ మంత్రి గంటా ఢిల్లీలో మకాం వేశారు. ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తో పాటు బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. గంటా తో పాటు మొత్తం 9 మంది టీడీపీ ఎమ్మెల్యే బీజేపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారట..

అయితే టీడీపీ నుంచి బీజేపీ లోకి మారితే వైసీపీ ప్రభుత్వం అనర్హత వేటు వేసే ప్రమాదం ఉంది. అలా కాకుండా టీడీపీ నే మొత్తం 1/3 వంతు బీజేపీ లో విలీనం చేస్తే అలాంటి వేటు పడదు. దీని పైనే బీజేపీ పెద్దలు చర్చిస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే అస్సలు ఏపీ అసెంబ్లీ లో ఒక్క సీటుకూడా గెలవని బీజేపీ.. 23 సీట్లు గెలిచి ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న టీడీపీ స్థానాన్ని భర్తీ చేస్తుంది. టీడీపీ ప్రతి పక్ష హోదా కోల్పోయి దిక్కు లేకుండా పోతుంది. ఏపీ అసెంబ్లీ లో వైసీపీకి పోటీగా ప్రతి పక్షంగా బీజేపీ నిలబడుతుంది.

ఇక వైసీపీ లో చేరడానికి రెడీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకో వద్దని స్వయంగా అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణలు వైసీపీ కీలక నాయకులతో చెప్పినట్టు సమాచారం. దీంతో వల్లభనేని వంశీ సహా కొందరు వైసీపీ బాట పట్టిన వారంతా ఇప్పుడు బీజేపీ వైపు టర్న్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా వారితో బీజేపీ లో చేరిక పై సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామి కూడా బీజేపీ బాట పట్టారు.

గంటా శ్రీనివాసరావుతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, విశాఖ జిల్లాకు చెందిన  టీడీపీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, అనంతపురం జిల్లాకు మరో టీడీపీ ఎమ్మెల్యే  బీజేపీ లో చేరడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసి ఏపీలో టీడీపీ అడ్రస్ గల్లంతు చేయడానికి అమిత్ షా ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. రాబోయే రెండుమూడు రోజుల్లో నే ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సో ఈ పరిణామం టీడీపీలో గుబులు రేపుతోంది.టీడీపీ అంతర్థానం తప్పదా అన్న భయం కూడా ఆ పార్టీని వెంటాడుతోంది. మరి అమిత్ షా వ్యూహాని కి టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి ప్రతి వ్యూహం రచిస్తాడన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News