ఆగస్టు నాలుగు నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి కీలకంగా వ్యవహరించే యాభై మంది కార్యకర్తలతో తాను భేటీ కానున్నానని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దీంతో ఇప్పుడీ నిర్ణయంపై నేతల్లో టెన్షన్ మొదలయింది. కార్యకర్తల నుంచి ఫీడ్ తీసుకున్నాకే, వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను నిర్ణయిస్తామని చెప్పడంతో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఇప్పటి నుంచే హడలిపోతున్నారు.
ముఖ్యంగా జిల్లాలలో పనులు చేసేందుకు ఇంత కాలం నిధులు లేవని సాకు చెప్పిన ఎమ్మెల్యేలకూ, ఇతర సమన్వయ కర్తలకూ నిన్నటి వేళ క్లాస్ ఇచ్చారు. నిధులు ఇచ్చినా పనుల ఎంపిక చేతగాకుంటే తానేం చేయలేనని తేల్చేశారు. చేతగాకుంటే తప్పుకోండి అని కూడా చెప్పారు. అంటే త్వరలో మళ్లీ మార్పులన్నవి ఉండనున్నాయా ? ఉంటే ఏ స్థాయిలో ..?
ఇప్పటికే మైనింగ్ కు సంబంధించి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (రాప్తాడు ఎమ్మెల్యే)పై పలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మైనింగ్, ఇసుక అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు తాను అందించినా ఫలితం లేదనే అంటున్నారు. ఇదే విధంగా నియోజకవర్గాల్లో చాలా చోట్ల కార్యకర్తలు ముఖ్య నాయకుల తీరుపై వారి అక్రమాలపై సీఎం దగ్గర గళం వినిపిస్తే ఇక వారి భవిష్యత్ అగమ్యగోచరం కావడం ఖాయమని వైసీపీ వర్గాల్లో ఓ అంతర్గత చర్చ నడుస్తోంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో ఇసుక తరలింపుపై ఇప్పటికే చాలాసార్లు చాలా అభియోగాలు వచ్చాయి.
అదేవిధంగా పాతపట్నం. నర్సన్నపేట తదితర నియోజకవర్గాల్లో పీఏల హవా నడుస్తుందన్న అభియోగాలూ ఉన్నాయి. వీటిని ఈ ప్రాంత కార్యకర్తలు సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు సంబంధిత ఆధారాలు, మీడియా కథనాలు కూడా చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో ఓ ముఖ్య నేత కుమారుడి కారణంగానే పార్టీ పరువు పోతుందని కూడా ఇప్పటికే సీఎంకు ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై మరోసారి కార్యకర్తలంతా ఏకమై ఆ నాయకుడ్ని తప్పించాలని కూడా ఫిర్యాదు చేయనున్నారు.ఇలాంటి ఫిర్యాదులే పాతపట్నం ఎమ్మెల్యేపై కూడా వచ్చాయి. ఆమె కూడా పీఏల హవాను నియంత్రించలేకపోతున్నారు.
కొన్ని చోట్ల సీనియర్లు క్రియాశీలకంగా లేకపోగా నిర్వేదంతో ఉన్న ఘటనలూ ఉన్నాయని సీఎంకు వివరించేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం ల ఇద్దరి పనితీరూ బాలేదని సంబంధిత వర్గాలు ఎప్పటి నుంచో సీఎంకు నివేదిస్తున్నాయి. నిన్నటి అత్యవసర సమావేశానికీ వారే హాజరయ్యారు.
అంటే తమ ఆరోపణల్లో నిజం ఉందని సీఎం గ్రహించారని, ఇప్పటికైనా అటువంటి నాయకులను తప్పించాలని కార్యకర్తలు సీఎంకు నివేదించే ఛాన్స్ ఉంది. ఇక విశాఖ వరకూ ప్రాంతేతర నాయకుల హవా అనగా సాయిరెడ్డి హవాను నియంత్రించాలని ఎప్పటి నుంచో మంత్రి బొత్స కూడా గోడు పెడుతున్నారు. ఇదే సమయంలో ఇంఛార్జ్ ను మార్చినా కూడా సుబ్బారెడ్డి వచ్చినా కూడా నో యూజ్ అని తేలిపోయింది. అందుకే ఇక్కడి సమస్యలపై మరోసారి కార్యకర్తలను అడిగి తెలుసుకోనున్నారు సీఎం. ఏ విధంగా చూసినా సీఎంలో మార్పు వైసీపీలో మార్పు పార్టీలో ఒక సంచలనమే.