అధికారం ఉన్న అధినేతకు ఏ విషయంలో కోపం వస్తుందో? మరే విషయంలో చికాకు వస్తుందో? అస్సలు అర్థం కాదు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థం కాక మానదు. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆసక్తికర అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నప్పుడు సహజంగా ఎమ్మెల్యేలు.. విపక్ష నేతలు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వలనుకుంటారు. మీరెందుకు కలవరు? అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
‘సీఎంను కలుస్తామని రాతపూర్వకంగా విజ్ఞాపనను పంపించాను. కలిసేందుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఏదైనా అంశంపై తమకున్న సమస్యల్ని తెలిపేందుకు ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇవ్వటం ఉండేది. కేసీఆర్ సీఎం అయ్యాక అలాంటివేమీ కనిపించని పరిస్థితి. ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో వామపక్ష నేతలతో పాటు విపక్షాలకు చెందిన నేతలు సీఎంను కలిసేందుకు వెళ్లటం.. గంటల కొద్దీ సమయం వెయిట్ చేయించిన కేసీఆర్.. ఆ తర్వాత వారిని కలిసేందుకు అనుమతించకపోవటంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ముఖ్యమంత్రిని తామెప్పుడూ చూడలేదని వామపక్ష నేతలు విరుచుకుపడ్డారు.
వర్తమానంలోకి వస్తే.. ముఖ్యమంత్రిని కలిసేందుకు తమకు సమయం ఇవ్వటం లేదన్న విషయంపై భట్టి సంధించిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది. సందర్భం కాని సమయంలో చేసిన ఈ వ్యాఖ్యల్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరటం.. అందుకు స్పీకర్ రికార్డుల్లో నుంచి వ్యాఖ్యల్నితొలగిస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎంను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవటం ఏమిటని ప్రశ్నించటం కూడా రికార్డుల్లో తొలగించేంత అసందర్భ వ్యాఖ్యా? అన్నది ప్రశ్నగా మారింది. అయినా.. చేసే పనిని ప్రశ్నిస్తే.. అంత చిరాకు పడాల్సిన అవసరం ఏమిటి కేసీఆర్? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.