జగన్ ను సస్పెండ్ చేశారు

Update: 2015-12-18 08:08 GMT
ఏపీ అసెంబ్లీలో రెండో రోజూ విపక్ష వైసీపీ ఆందోళనలు ఆగలేదు. దీంతో సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ సభలో గందరగోళం చేస్తున్నారన్న కారణంతో జగన్ సహా వైసీపీ సభ్యులందరినీ స్పీకర్ సస్పెండ్ చేశారు. వైకాపా సభ్యుల పేర్లను చదివి వినిపించిన యనమల సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్న వారిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీనిపై స్పీకర్ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకుని వైకాపా సభ్యులను సస్పెండ్ చేశారు. వైకాపా సభా పక్ష నాయకుడు జగన్ సహా సభలో ఉన్న వైకాపా సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారుసభలో అంబేద్కర్ పై చర్చ ముగిసే వరకూ వైకాపా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

అంబేద్కర్ పై సభలో చర్చ పూర్తయ్యే వరకూ విపక్ష నేత జగన్ సహా వైకాపా సభ్యులందరిపైనా సస్పెన్షన్ వేటు పడినా కూడా వారి తీరు మారలేదు. సస్పెండైన సభ్యులు సభను వీడకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకుపోయి నినాదాలు చేశారు. ఈ స్థితిలో సస్పెండైన సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పదే పదే కోరినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి వారిని బయటకు పంపించారు.
Tags:    

Similar News