ఇండియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనం లైన్లో నుంచుని కనిపిస్తున్నారు. బ్యాంకులు - ఏటీఎంల వద్ద బారులు తీరడమే కాదు చివరకు మనుష్య సంచారానికి దూరమైన పోస్టాఫీసుల ముందు కూడా లైన్లు కడుతున్నారు. ఇదంతా డబ్బులు అవసరమై కాదట... మోడీకి మద్దతుగా - మీ వెంట మేమున్నాం అంటూ జనం నిల్చుంటున్నారట. అవును... దేశంలో 80 నుంచి 86 శాతం మంది పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ ప్రకటించిన యుద్ధానికి మద్దతు పలుకుతున్నారని ఇంటర్నేషనల్ సర్వే ఏజెన్సీ సీ-ఓటర్ వెల్లడించింది. ఎలక్షన్ సర్వేలు - ఒపీనియన్ పోల్స్ నిర్వహించే ఈ సంస్థ తాజాగా ఇండియాలో మోడీ బ్లాక్ మనీ వార్ ఎఫెక్టు ఎలా ఉంది... ఇది మోడీని దెబ్బతీస్తుందా లేదంటే ఇంకా పెద్ద హీరోను చేస్తుందా అన్న కోణంలో సర్వే చేసింది. సర్వేలో తేలిందేమిటంటే మోడీ ఇక మెగా సూపర్ పవర్ స్టార్ అయిపోతారని తేల్చింది.
సీ-టర్ సంస్థ దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో మెజారిటీ ప్రజలు మోదీ నిర్ణయానికి అనుకూలంగా ఓటేశారు. సర్వేలో పాల్గొన్న గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 86 శాతం మంది నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతూనే మోడీ నిర్ణయాన్ని సమర్థించారు.
పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది మోడీకి మద్దతు పలకగా... సెమీ అర్బన్ ప్రాంతాల వారు 65.1 శాతం - సెమీ రూరల్ జోన్స్‌లో 59.4 శాతం మంది నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు.
పట్టణ ప్రాంతాల్లో 23.8 శాతం - సెమీ అర్బన్ ప్రాంతాల్లో 24.3 శాతం - గ్రామీణ ప్రాంతాల్లో 36 శాతం మంది ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనని అంగీకరించారు. నిర్ణయం మంచిదే అయినా అమలులో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.
నల్లధనంపై యుద్దానికి నోట్ల రద్దు ఎంతగానో ఉపకరిస్తుందని 86 శాతం మంది పట్టణ ప్రజలు - 80.6 శాతం మంది సెమీ అర్బన్ - 86 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణలోనూ సీ-ఓటర్ సంస్థ ట్రాక్ రికార్డు బాగుండడం... ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటుండడంతో ఇప్పుడు ఈ సర్వే కూడా ప్రజాభిప్రాయాన్ని కచ్చితంగానే ప్రతిబింబిస్తోందని అంటున్నారు. ఇంకేముంది మోడీ హ్యాపీగా నిద్రపోవచ్చన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/