డిసెంబర్ లో ఆక్స్‌ ఫర్డ్ 'కరోనా టీకా '

Update: 2020-10-26 13:30 GMT
కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతుంది. ప్రపంచ మొత్తం మళ్లీ గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనితో ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంది. ఈ సమయంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే రెండు ట్రయల్స్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడవ ట్రయల్స్ ‌ను కొనసాగిస్తోన్న ‘ఆక్స్‌ఫర్డ్‌ కరోనా ‌ వ్యాక్సిన్‌’ మొదటి విడతను ఈ డిసెంబర్‌ నెలలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు.

 దానికి, అవసరమైన అధికారిక అనుమతిని క్రిస్మస్‌ లోగా పొందేందుకు ప్రయత్నాలను వారు ముమ్మరం చేశారు. వ్యాక్సిన్‌‌ కు సంబంధించి మూడవ ట్రయల్స్ ‌‌ కూడా విజయవంతం అయితేగానీ అధికారిక అనుమతి లభించదు. అయితే కరోనా బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ తాము ఆ వైరస్‌ బారిన పడుతోన్న వైద్య సిబ్బందికి, వ్యాక్సిన అత్యవసరంగా అందించాల్సిన అవసరం ఉన్న వృద్ధ రోగులకు మొదటి విడత కింద డిసెంబర్‌ లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని వ్యాక్సిన్‌ ప్రాజెక్ట్‌ కు నాయకత్వం వహిస్తోన్న ఆక్స్‌ ఫర్డ్‌ ప్రొఫెసర్‌ ఆండ్రియన్‌ హిల్‌ మీడియాకు తెలిపారు.

మూడవ విడత ట్రయల్స్‌ పూర్తి కాక మునుపే మొదటి విడత వ్యాక్సిన్‌ డోసుల విడుదలకు అనుమతి కోరుతున్నామని, క్రిస్మస్ ‌లోగా అనుమతి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మూడవ ట్రయల్స్‌ పూర్తయ్యాక దేశ ప్రజలతోపాటు ఒప్పందం చేసుకున్న దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌ డోస్‌ లను 2021 తొలినాళ్లలో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రొఫెసర్‌ ఆండ్రియన్‌ తెలిపారు.
Tags:    

Similar News