కరోనా అంతంపై ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-07-02 16:27 GMT
కరోనా అందరినీ అతలాకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోటి కేసులు దాటాయి. అందరూ దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ పరిశోధనలో అందరికంటే ముందు ఉంది బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ. ఇప్పటికే మానవులపై క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉంది.

ఈ నేపథ్యంలోనే కరోనాపై పరిశోధిస్తున్న ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సునేత్ర గుప్త తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అవసరం పెద్దగా ఉండబోదని ఆమె స్పష్టం చేశారు.

ఇదివరకు వ్యాపించిన ఇన్ ఫ్లూఎంజా వైరస్ మాదిరిగానే కరోనా కూడా మన జీవితంలో ఒక భాగమవుతుందని.. ఈ మహమ్మారి సహజంగానే అంతం అవుతుందని సునేత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్న వ్యక్తులే ఎక్కువగా కరోనా బారిన పడుతారని సునేత్ర తెలిపారు. అందరికీ కరోనా వ్యాక్సిన్ అవసరం ఉండదని.. ఎవరైతే వైరస్ కు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందో వారికి మాత్రమే వ్యాక్సిన్ అవసరం అవుతుందని ఆమె తెలిపింది.
Tags:    

Similar News