ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఫైనల్ ట్రయల్స్ ...అసలు నిజమైయ్యేనా !

Update: 2020-06-26 12:30 GMT
దేశంతో పాటు ప్రపంచంలో వైరస్ కేసులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఇప్పటిదాకా దానికి సరైన ట్రీట్ మెంట్ అంటూ ఏమీ లేదు. దాని వల్ల వచ్చే లక్షణాలను కంట్రోల్ చేస్తూ వైరస్ ను కట్టడి చేస్తున్నారు డాక్టర్లు. వివిధ మందుల కాంబినేషన్ తో ఒంట్లోని వైరస్ లోడ్ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కొన్ని మందులూ మార్కెట్లోకి వస్తున్నాయి.

వ్యాక్సిన్లపైనా రీసెర్చ్ లు, ట్రయల్స్ జోరుగా సాగుతున్నాయి. అందులో ముందు వరుసలో ఉంది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ చేడాక్స్1ఎన్ కొవ్ 19. ఆ వ్యాక్సిన్ ఇప్పుడు ఫైనల్ ట్రయల్స్ దశలోకి ఎంటరైపోయింది. ఫైనల్ ట్రయల్స్లో కి ఎంటరైన ఫస్ట్ వ్యాక్సిన్ గా క్రెడిట్ కొట్టేసింది. బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికాతో పాటు మన దేశానికి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం చేసుకున్నాయి.

కేవ‌లం బ్రిట‌న్ లోనే కాకుండా.. వేరే దేశాల్లో కూడా వ‌లంటీర్ల మీద ఈ వ్యాక్సిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ సాగుతున్నాయ‌ని ఆ సంస్థ తాజా అప్ డేట్ ను ప్ర‌క‌టించింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ కు త‌మ టీకాను అందుబాటు లోకి తీసుకు రాబోతున్న‌ట్టుగా ఇది వ‌రకే ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు ఇప్పుడు మ‌రోసారి అందుకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చింది. చింపాజీల‌పై ఈ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతం అయ్యాయ‌ని ఆ సంస్థ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత మాన‌వుల‌ పై ప్ర‌యోగాల‌ను కొన‌సాగిస్తూ ఉంది. ఒక్కో ద‌శ‌లో కొంత‌ మంది మీద ప్ర‌యోగాల‌ను నిర్వ‌హిస్తోంది.

నంబ‌ర్ ను పెంచుకుంటూ పోతూ ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తున్న‌ట్టుగా ప‌రిశోధ‌కులు వివ‌రిస్తున్నారు. బ్రిట‌న్ లో మాత్ర‌మే కాకుండా.. బ్రెజిల్ లో కూడా కొంత‌మంది వ‌లంటీర్ల మీద ఈ వ్యాక్సిన్ ను ప‌యోగించార‌ట‌. అలాగే ద‌క్షిణాఫ్రికాలోనూ కొంత‌మంది పై ఈ వ్యాక్సిన్ ను ప్ర‌యోగించార‌ట‌. ఇక తుదిద‌శ ప్ర‌యోగాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  

ఈ ద‌శ‌లో భారీ ఎత్తున చాలా మంది పై ఈ వ్యాక్సిన్ ను ప్ర‌యోగిస్తార‌ట‌. బ్రిట‌న్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు వేల మంది వలంటీర్లు ముందుకు వ‌చ్చార‌ని, మ‌రో ప‌ది వేల మంది మీద ఈ వ్యాక్సిన్ ను ప్ర‌యోగించి.. ఫ‌లితాల‌ను స‌మీక్షించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫ‌లితాలపై ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ క‌ళ్లా క్లారిటీ స‌మీక్ష పూర్త‌వుతుంద‌ని, అక్టోబ‌ర్ కు  ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టుగా ప‌రిశోధ‌కులు వివ‌రిస్తున్నారు.
Tags:    

Similar News