ఆక్సిజన్ కొరత .. 20 మంది మృతి , ప్రమాదంలో 200 మంది !

Update: 2021-04-24 08:30 GMT
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేగుతుంది. దేశంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఢిల్లీలో ఎక్కువగా ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నారు.  తాజాగా శనివారం ఢిల్లీలోని జైపూర్‌ గోల్డెన్ ఆస్పత్రిలో కరోనా ‌తో తీవ్రంగా బాధపడుతున్న మరో 20 మంది రోగులు ఆక్సిజన్‌ అందక మృతి చెందారు. మరో అరగంట పాటే ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయని గోల్డెన్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ కొరత వల్లే 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని , మరో 200 మందికి పైగా కోవిడ్‌ రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వైద్యులు తెలిపారు.

మరోవైపు ఆక్సిజన్‌ నిల్వలు లేక ఢిల్లీలోని సరోజ్‌ ఆస్పత్రిలో అడ్మిషన్లు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతమున్న రోగులను సరోజ్‌ ఆస్పత్రి వర్గాలు డిశ్చార్జి చేస్తున్నాయి.  మరణించిన 20 మంది రోగులూ ఆక్సిజన్‌ సపోర్ట్‌తో ఉన్నారు. ఆక్సిజన్ సరిపడా లేని కారణంగా మేము ఆక్సిజన్ సరఫరా ఫ్లోను తగ్గించాం. అందరూ ఆక్సిజన్ అందక మరణించారని నేను అనడం లేదు. కానీ అదీ ఓ కారణమే’’ అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో 22 మంది కరోనా రోగులు మరణించారు.  బాత్రా ఆస్పత్రికి డిమాండ్‌కు తగ్గట్టు ఆక్సిజన్‌ సరఫరా కావడం లేదు. 8వేల లీటర్ల ఆక్సిజన్‌ అవసరం కాగా  కేవలం 500 లీటర్ల ఆక్సిజన్‌ మాత్రమే వస్తుండటంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బాత్రా ఆస్పత్రిలో 350 మంది రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్‌పైనే కోవిడ్‌ రోగులకు చికిత్స ఆధారపడి ఉందని బాత్రా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Tags:    

Similar News